breaking news
gold silver price
-
గోల్డ్.. బౌల్డ్
న్యూఢిల్లీ: వెండి, బంగారంలో పెద్ద మొత్తంలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా వరుసగా రెండో రోజు ప్రీమియం లోహాలు భారీ పతనాన్ని చూశాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో వెండి మార్చి డెలివరీ కాంట్రాక్టు కిలోకి ఏకంగా రూ.26,273 నష్టపోయింది. 9 శాతం నష్టంతో రోజులో అనుమతించిన కనిష్ట పరిమితి (10 శాతం లోయర్ సర్క్యూట్)కి సమీపంలో 2,65,652 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో (శుక్రవారం) వెండి కిలోకి ఏకంగా రూ.1,07,968 (27 శాతం) పడిపోయి రూ.2,91,925 వద్ద ముగియడం తెలిసిందే. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో వెండి కిలోకి రూ.1,34,241 నష్టపోయింది. ఇది 33.6 శాతానికి సమానం. బంగారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు (10 గ్రాములు) 3 శాతం నష్టంతో (రూ.4,241) రూ.1,48,104 వద్ద స్థిరపడింది. ఆరంభంలో 10 శాతం నష్టంతో రూ.1,38,634 వద్ద లోయర్ సర్క్యూట్‌ను సైతం తాకింది. ఆ తర్వాత కొంత కోలుకుంది. బంగారం సైతం అంతక్రితం సెషన్లో 10 గ్రాములకు రూ.31,617 (17.2 శాతం) నష్టపోయి రూ.1,52,345 వద్ద స్థిరపడడం తెలిసిందే. గత గురువారం బంగారం కాంట్రాక్టు రూ.1,93,096 పలకడం గమనార్హం. పెరుగుట విరుగుట కొరకే.. చాలా వేగంగా బంగారం, వెండి ధరలు పెరగడం పతనానికి దారితీసిందని, బులియన్ ధరల్లో అదే చూస్తున్నామని జీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ తెలిపారు. ‘‘బంగారం 20 శాతం పతనమైంది. వెండి గరిష్టాల నుంచి 37 శాతం నష్టపోయింది. దేశీ మార్కెట్లో ఆదివారం కూడా అమ్మకాలు కొనసాగాయి’’అని వివరించారు. వాస్తవానికి అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లకు ఆదివారం సెలవు. గత శుక్రవారం దేశీ మార్కెట్లలో కంటే అంతర్జాతీయ మార్కెట్లలో వెండి, బంగారంలో దిద్దుబాటు ఎక్కువగా నెలకొంది. దీంతో మన మార్కెట్లో ఆదివారం (బడ్జెట్ కారణంగా ట్రేడింగ్) అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ నెల డెలివరీ కాంట్రాక్టు ఔన్స్‌కు 612 డాలర్లు (11 శాతం) నష్టంతో 4,763 డాలర్లకు దిగి రావడం గమనార్హం. గురువారం దీని గరిష్ట ధర 5,626 డాలర్లు. కామెక్స్‌లో వెండి మార్చి కాంట్రాక్ట్ 35.89 డాలర్లు పడిపోయి (31 శాతం) 78.53 డాలర్లకు పరిమితమైంది. మారిన పరిణామాలు.. యూఎస్ ఫెడ్ చైర్మన్ జిరోమ్ పావెల్ సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని సంకేతం ఇవ్వడంతో డాలర్ బలపడిందని, ఇది బులియన్ ధరలపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు కెవిన్ వార్‡్షను తదుపరి ఫెడ్ చైర్మన్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించడం సైతం ప్రభావం చూపించినట్టు చెబుతున్నారు. ‘‘లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. దీనికితోడు నెలవారీ కాంట్రాక్టుల ఎక్స్పైరీ సమీపించడం అమ్మకాలకు దారితీసింది. ధరల పతనం నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు బంగారం, వెండి కాంట్రాక్టుల మార్జిన్లను పెంచేశాయి. దీంతో ఆటుపోట్లు మరింత పెరిగాయి. వచ్చే కొన్ని సెషన్లలో మరింత దిద్దుబాటు చేసుకోవచ్చు. ఆ తర్వాతే ధరలు స్థిరపడొచ్చు’’అని అని ప్రణవ్ మీర్ తెలిపారు. -
పరుగు ఆపని పసిడి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జోడు గుర్రాల్లా పరిగెడుతున్న వెండి, బంగారం మరోసారి కదంతొక్కాయి. స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పసిడి 10 గ్రాములు రూ. 1,500 బలపడి రూ. 1,58,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 9,500 జంప్‌చేసి రూ. 3,29,500ను తాకింది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం, వెండి సరికొత్త రికార్డులను సాధించాయి. కేజీ వెండి తాజాగా 4 శాతం జంప్‌చేసింది. ఎంసీఎక్స్‌లో మార్చి కాంట్రాక్ట్ రూ. 12,638 బలపడి రూ. 3,39,927ను తాకింది. ఇదే బాటలో బంగారం 10 గ్రాములు 2 శాతం(రూ. 2,885) ఎగసింది. ఫిబ్రవరి డెలివరీ రూ. 1,59,226కు చేరింది. బుధవారం వెండి(కేజీ) రూ. 3,35,521 వద్ద, గురువారం పసిడి(10 గ్రా.) రూ. 1,56,341 వద్ద చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం విదితమే. వెరసి బంగారం వరుసగా ఐదో రోజు లాభపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు 98.31కు వెనకడుగు వేయడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్ పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సిల్వర్ సెంచరీ..యూఎస్ కామెక్స్‌లోనూ వెండి, బంగారం గరిష్ట ధరలతో ధగధగలాడుతున్నాయి. ఔన్స్ వెండి చరిత్రలో తొలిసారి 100 డాలర్లను దాటగా.. బంగారం అంచనాలను నిజం చేస్తూ ఔన్స్(31.1 గ్రా.) 5,000 డాలర్ల సమీపానికి చేరింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.7 డాలర్లు ఎగసి 100 డాలర్లను తాకింది. గోల్డ్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ 4,989.54 డాలర్లను తాకింది. వెరసి 2020 మార్చి తదుపరి ఈ వారం అత్యధికంగా లాభపడినట్లు నిపుణులు వెల్లడించారు. -
సిల్వర్ స్పీడుకు బ్రేక్
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి ధరల పరుగుకు కాస్త బ్రేక్ పడింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ. 2,500 తగ్గి రూ. 1,57,200 వద్ద ముగిసింది. అటు తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేసిన వెండి ధర కిలోకి రూ. 14,300 క్షీణించి రూ. 3,20,000కి పరిమితమైంది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూరప్ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రెండు మెటల్స్ కాస్త నెమ్మదించినట్లు వివరించారు. భౌగోళిక–రాజకీయ రిసు్కలపై ఆందోళన కొంత తగ్గడంతో దేశీ మార్కెట్లలో పాక్షికంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 8.80 డాలర్లు తగ్గి 4,822.65 వద్ద ట్రేడయ్యింది. వెండి మాత్రం 0.27 శాతం పెరిగి 93.36 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ నిర్ణయాల వెల్లడికి ముందు ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో పసిడి, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కాయ్నాత్ చైన్వాలా తెలిపారు. -
బంగారం రూ.2 లక్షలు.. వెండి రూ.3 లక్షలు?
గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ ఈ విలువైన లోహాలపై పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడులుగా భావించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో 2026 నాటికి బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.2 లక్షలకు, వెండి కిలో ధర రూ.3 లక్షలకు చేరుతాయా? అనే ప్రశ్న మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇప్పటికే రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1.35 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ట్రేడవుతోంది. అదే విధంగా వెండి ధర కిలోకు సుమారు రూ.2.3 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంది. ఈ ధరలు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు భవిష్యత్ ధరలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 వరకు బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొందరు ఊహిస్తున్నట్లుగా అత్యధిక స్థాయిలైన రూ.2 లక్షలు, రూ.3 లక్షలను తాకడం మాత్రం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాముల ధర రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా వెండి ధర కిలోకు రూ.2.3 లక్షల నుంచి రూ.2.6 లక్షల పరిధిలోనే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.బంగారం, వెండి ధరలు పెరగడానికి పలు అంతర్జాతీయ కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటం, అమెరికన్ డాలర్ బలహీనపడే సూచనలు కనిపించడం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి.మరోవైపు వెండికి సంబంధించిన డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల అవసరాల కోసం వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కారణాల వల్ల వెండి ధరలు బలంగా నిలబడుతున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం, వెండి భవిష్యత్తులో పెట్టుబడిదారులకు స్థిరమైన లాభాలు అందించే అవకాశాలు ఉన్నప్పటికీ, అతిగా అంచనాలు వేసుకోవడం కంటే మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గాలైన బంగారం, వెండి ధరల్లో గత రెండు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిసెంబర్ 29, 30 తేదీల్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధర తన జీవితకాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 3 శాతానికిపైగా క్షీణించింది. అదే సమయంలో బంగారం ధర కూడా 1.7 శాతం తగ్గింది. అయితే ఇందుకు అంతర్జాతీయంగా కొన్ని సంఘటనలు కారణమవుతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలుఈ ధరల పతనానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న సంకేతాలు రావడం ప్రధాన కారణమని అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన చర్చలు కొత్త ఆశలను చిగురింపజేశాయి. ‘శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం’ అని వారు ప్రకటించడం పెట్టుబడిదారుల ఆలోచనా ధోరణిని మార్చేసింది.యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోకుండా ఉండటానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అందుకే ధరలు పెరిగాయి. ఇప్పుడు ట్రంప్-జెలెన్స్కీ శాంతి చర్చల వల్ల యుద్ధం ముగిసిపోతుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల భయం తగ్గి, పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఇతర రంగాల్లో (స్టాక్స్ వంటివి) పెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది.ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.. శాంతిగా ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య 90% శాంతి ఒప్పందం కుదిరిందనే వార్త రాగానే మార్కెట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. రిస్క్ తగ్గితే సహజంగానే బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు వెళ్లే వారు తగ్గుతారు. తద్వారా ధరలు పడిపోతాయి.సరఫరా గొలుసు మెరుగుపడుతుందనే ఆశరష్యా ప్రపంచంలో బంగారం, వెండిని ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. యుద్ధం వల్ల రష్యాపై ఉన్న ఆంక్షలు సరఫరాను తగ్గించాయి. శాంతి చర్చలు సఫలమైతే, రష్యా నుంచి మెటల్స్ సరఫరా మళ్ళీ పుంజుకుంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి.ధరల పతనానికి దోహదం చేసిన ఇతర అంశాలు2025లో వెండి అసాధారణ లాభాలను అందించింది. గరిష్ట ధరల వద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి విక్రయాలకు మొగ్గు చూపారు.నూతన సంవత్సర వేడుకల ముందు మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి.డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు భవిష్యత్ ధరలను నిర్ణయిస్తాయి.ప్రస్తుత ఉద్రిక్తతలుశాంతి చర్చలు ఒకవైపు సాగుతుండగానే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. డిసెంబర్ 29 రాత్రి పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని రష్యా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీన్ని ఉక్రెయిన్ ఖండించినప్పటికీ రష్యా తన వైఖరిని కఠినతరం చేస్తామని హెచ్చరించడం మార్కెట్లలో మళ్లీ అనిశ్చితిని నింపింది. ఈ పరిణామం శాంతి ప్రక్రియకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.భవిష్యత్తు అంచనాలుముగింపు దిశగా సాగుతున్న ఈ చర్చలు విజయవంతమైతే బంగారం, వెండి ధరలు మరింత స్థిరీకరణకు లేదా స్వల్ప పతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే, వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ (ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం) ధరలను పూర్తిగా పడిపోకుండా కాపాడుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత ఉద్రిక్తతలను, శాంతి చర్చల ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తూ తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
బంగారు కొండ దిగొస్తోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది. వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్‌కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్‌ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు. -
బంగారం బాటలోనే వెండి: స్థిరంగా ధరలు
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ రోజు (గురువారం) మాత్రం ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో సెప్టెంబర్ 5న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం పసిడి ధరలు రూ. 66690 & రూ. 72760 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66690, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72760గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66840 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72910 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా గురువారం (సెప్టెంబర్ 5) స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్న మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు
గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. ⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. ⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. ⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి. నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది. ⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం. ⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ. ⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
భారం : బంగారం ధరలు మళ్లీ పైపైకి..
ముంబై : గతవారం భారీగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధర పుంజుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 4.5 శాతం తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో పైకెగిశాయి. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 306 రూపాయలు భారమై 52,533 రూపాయలకు పెరిగింది. ఇక కిలో వెండి ఏకంగా 1729 రూపాయలు పెరిగి 68,900 రూపాయలు పలికింది. కాగా కరోనా వైరస్ విజృంభణ, అమెరికా-చైనా ట్రేడ్‌వార్, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 28.4 శాతం పెరిగాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల కదలికలను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : ఊరట : పసిడి నేలచూపులు -
తగ్గుతున్న వెండి, పసిడి ధరలు
-
తగ్గుతున్న వెండి, పసిడి ధరలు
ముంబయి : నిన్న మొన్నటి వరకూ పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారాంతంలో 500 రూపాయలకు పైగా పెరిగిన 10 గ్రాముల ధర సోమవారం ఉదయం 550 రూపాయల దాకా తగ్గింది. ప్రస్తుతం ఎంసీక్స్లో ధర 29,550 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 2 డాలర్లు తగ్గి 1325 డాలర్లకు రావడం.. మన మార్కెట్లో రూపాయి.. రూపాయి దాకా బలపడటంతో 10 గ్రాముల బంగారం ధర తగ్గుతోంది. ఈవారంలో అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్.. స్టిమ్యులస్ పాకేజీల ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది అనే వార్త కూడా బంగారానికి ప్రతికూలంగా మారింది. స్టిమ్యులస్ ప్యాకేజీల ఉపసంహరణ వల్ల డాలర్ల ముద్రణ తగ్గుతుంది. గత ఐదేళ్లుగా ఇష్టానుసారం డాలర్లు ప్రింట్ చేయడం వల్ల బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అదే కారణంతో ఔన్స్ ధర తగ్గుతూ వస్తోంది. 1900 డాలర్ల నుంచి 1300 డాలర్ల స్థాయికి వచ్చింది. బంగారం లాగే వెండి ధర కూడా పతనమవుతోంది. ప్రస్తుతం ఎంసీక్స్లో కేజీ ధర 1600 రూపాయల దాకా నష్టపోతూ 49 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవువతోంది.


