Disclosure of assets
-
యూఎఫ్‌వోలపై ఫైళ్లు బహిర్గతం
వాషింగ్టన్: గ్రహాంతర జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)లకు సంబంధించిన ఫైళ్లను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ బహిర్గతం చేసింది. వీటిపై ప్రజలు ఎవరికి వారు సొంత అవగాహన ఏర్పర్చుకోవచ్చని శుక్రవారం ఎక్స్‌లో తెలిపింది. పెంటగాన్తోపాటు వైట్ హౌస్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇంధన శాఖ, నాసా, ఎఫ్‌బీఐలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఈ సమాచారాన్ని తక్కువ చేసి చూపడానికి, వారిని నిరుత్సాహ పర్చడానికి ప్రయత్నించాయన్న పెంటగాన్.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గరిష్ట పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. యూఎఫ్‌వోల ఫైళ్లను క్రమపద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ఫైళ్లను బహిర్గతం చేస్తామంటూ ట్రంప్ ఫిబ్రవరి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన కెన్నెడీ సోదరులు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీలతోపాటు, మార్టీన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించిన రికార్డులను విడుదల చేశారు. అయితే, ఇందులో అప్పటికే తెలిసిన విషయాలకు మించి మరేమీ కొత్తగా వెల్లడి కాలేదు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని పెంటగాన్ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. సైనిక సిబ్బంది తాము చూసిన వింత ఎగిరే వస్తువుల గురించిన సమాచారాన్ని పంచుకోవడంతో దశాబ్దాల నాటి ఫైళ్లను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్ 2022లో పెంటగాన్‌ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయం 2024లో విడుదల చేసిన మొట్టమొదటి నివేదికలో..గుర్తు తెలియని దృగి్వషయాలకు సంబంధించిన ఘటనలు వందలాదిగా నమోదయ్యాయని తెలిపింది. గ్రహాంతర జీవుల సాంకేతికతను అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు మాత్రం ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. కాగా, సైనిక సాంకేతికతపై అవగాహన లేని వారు తాజాగా వెల్లడి చేసిన వీడియోల విషయంలో పొరపాటుపడే అవకాశం ఉందని, తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్
న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల వాటాలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్తంభింప (ఫ్రీజ్) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్ సహా 21 ప్రమోటర్ సంస్థల వాటాలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్క్లోజర్’ నిబంధనల కింద స్టాక్ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది. కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది. నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్ (పతంజలి ఫుడ్స్ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్ వచ్చింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది. మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్ ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్‌దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు. -
రూ. 3 కోట్లకు అమ్మిపెడతా... సిద్ధమా!
- ఆస్తుల వెల్లడిపై లోకేశ్‌ది బోగస్ సమాచారం: తలసాని ఆస్తుల వెల్లడిపై నారా లోకేశ్ అంతా బోగస్ సమాచారమిచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడిలా చెప్పుకుంటున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌లో కోట్లు పలికే ఇంటి విలువను కేవలం రూ.24 లక్షలుగా లోకేశ్ పేర్కొనడం విడ్డూరం. దాన్ని రూ.3 కోట్లకు అమ్మిపెట్టిస్తా. అమ్మేందుకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి తలసాని మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏపీ సీఎం కుటుంబ ఆస్తుల వ్యవహారంలో ఆంధ్ర మీడియా హైప్‌ను సృష్టించిందని, చంద్రబాబు, ఆయన సన్నిహితులతో తనకు మంచి సంబంధాలు ఉండేవని, అందువల్ల ఆయన ఆస్తులు ఎలా సంపాదించారు, వాటి విలువ ఎంత అనేది బాగా తెలుసన్నారు. విజయవాడలో ఉండే పాలన చేసుకుంటేనే బాబు ఆరోగ్యానికి మంచిది అని తలసాని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీని నాలుగు రోజులే నిర్వహించారని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కారని, అందుకు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీని వీలైనన్నీ ఎక్కువరోజులు నిర్వహించడంతో పాటు అన్ని విషయాలు మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇస్తామన్నారు. ఇంట్లో కూర్చున్నా గెలుస్తా...: సనత్‌నగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే ఇంట్లో కూర్చున్నా గెలుస్తానని తలసాని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరగవచ్చునని, ఈ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, వచ్చే మూడేళ్లలో జరిగే అభివృద్ధి చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పారు. ప్రాజెక్టులు రీ డిజైన్ చేశాక, వ్యవసాయానికి 9 గంటల సరఫరా చేసి సీఎం నీటి పారుదల వనరులను రైతులకు అందుబాటులోకి తెస్తారని, దీంతో ఆత్మహత్య లు తగ్గుతాయని అన్నారు. పొలిటికల్ కెరీర్ అనేది ఒక సైకిల్ వంటిదని, ఒక రాజకీయవేత్త ఒకచోట నుంచి మరోచోటకు మారవచ్చునన్నారు. తలసానితో కాంగ్రెస్ నేత దానం నాగేందర్ భేటీ కావడంపై ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు.


