breaking news
cock fighting
-
మూడు కోళ్లు, ఊరికి రూ.12 వేలు... ఇదీ ఓ ఎస్ఐ రేటు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మీ ఊళ్లో బరి గీసుకోండి. ఊరికి మూడు కోళ్లు...రూ. 12 వేలు ఇవ్వండి! ఇది అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్ఐ సంక్రాంత్రి వసూళ్ల లెక్క! భారీగా ‘బరి’లు గీసుకోండి. మందు, డ్యాన్సులు మీ ఇష్టం. స్థానిక ప్రజా ప్రతినిధులూ పాల్గొంటున్నారు కాబట్టి ఇబ్బందేమీ లేదు. గుండాట, లాటరీ బాల్ ఏ ఆటైనా మీ ఇష్టం. మా వాటా మాకిస్తే చాలు. ఇది అనకాపల్లి జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల కథ! ఊళ్లో ఉత్సవం ఉందా? కోడి పందాలు నిర్వహించుకోండి. మేమేమీ పట్టించుకోం!! ఇది తాజాగా మరో నియోజకవర్గంలో పరిస్థితి. ఇలా అన్ని చోట్లా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహించుకుంటుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా చీడికాడలో కోడి పందాల నిర్వహణలో బరిలో నిలిచిన కోళ్లకు తగిలించిన కత్తి తగిలి ఏకంగా వడిసిలి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 1వ తేదీన జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా చేతులు తడిపిన పోలీసుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం. కాసుల రుచి మరిగి.. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణతో భారీగా ఆదాయానికి అలవాటు పడిన పోలీసు, రెవెన్యూ వర్గాలు గ్రామీణ ఉత్సవాల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా చీడికాడలో నిర్వహించిన కోడి పందాలతో బరిలో ఉన్న కోళ్లకు కట్టిన కత్తి తెగి ఏకంగా ఒక వ్యక్తి మరణించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా చోడవరంలో కూడా తాజాగా బయటకు వచ్చిన డ్యాన్సుల వీడియో కూడా హల్చల్ చేసింది. అశ్లీల నృత్యాలు కాదంటూ స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహాలో ఉత్సవాలను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే గ్రామ ఉత్సవాలన్నింటిలోనూ కోడి పందాల నిర్వహణకు అనుమతిలిచ్చి జేబులు నింపుకోవడానికి అటు రెవెన్యూ, ఇటు పోలీసువర్గాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే చీడికాడలో వ్యక్తి మృతిచెందిన వ్యవహారంలో ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ కోడి పందాలతోనే చనిపోయాడని మాత్రం గుసగుసలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై బదిలీ వేటు పడింది. అంతేకాకుండా ఉత్సవాల పేరుతో పందాల నిర్వహణకు అనుమతించిన పోలీసులు, వారి వసూళ్లపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ నగర శివారులోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరిపై బదిలీ వేటు పడనుందనేది చూడాల్సి ఉంది. గోదావరి జిల్లాలకు దీటుగా...! గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల అండదండలతో భారీగా ‘బరి’లు రంగంలోకి వచ్చాయి. గతంలో సంక్రాంత్రి పందెం కోళ్ల బరిలను చూసేందుకు పక్కనే ఉన్న గోదావరి జిల్లాలకు వెళ్లేవారు. అయితే, ఈ దఫా మాత్రం అదే స్థాయిలో భారీ సెట్టింగులతో స్థానికంగానే నిర్వహించారు. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఓ రేంజ్లో పందెం బరిలు గీశారు. అలాగే పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో కూడా ఒక మోస్తరుగా పందెం బరిలు ఏర్పాటు చేసుకున్నారు. కోడి పందాలతో పాటు డ్యాన్సులూ హోరె త్తాయి. ఇంతటితో ఆగకుండా భారీగా మద్యం అమ్మకాలతో పాటు గుండాట, లాటరీ బాల్ ఆటలకూ లాటరీ పద్ధతిలో స్టాళ్ల కేటాయింపులు జరిగాయి. ఒక్కో స్టాలుకు రూ.8 లక్షల చొప్పున వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల ఊపుతో ఇప్పుడు గ్రామాల్లో జరిగే ఉత్సవాలకు కూడా కోడి పందాల నిర్వహణ వ్యవహారం పాకడం గమనార్హం. -
కోడిపందాల్లో హోంమంత్రి అనిత
-
బరుల వద్దే క్యాసినోలు..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కోర్టు తీర్పులను లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని విచ్చలవిడి జూద క్రీడలకు తెర తీశారు. ఇప్పటికే ఊరూరా బెల్టు షాపులు, కుటీర పరిశ్రమలా మద్యం తయారీ, సహజ వనరుల దోపిడీతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సంక్రాంతి పండుగనూ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ముడుపులు తీసుకుని కోడి పందేల బరుల వద్ద క్యాసినోలు, జూద క్రీడలకు పచ్చజెండా ఊపారు. దీంతో మూడు రోజుల్లో రూ.వేల కోట్లు చేతులు మారాయి! టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల తరహాలో జూదాల జాతర సాగుతోంది. అన్ని బరుల వద్దా పేకాట, గుండాట, కోతముక్క నంబర్ల ఆటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.బరుల వద్దే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ.5 వేల కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. పెద అమిరం వద్ద బరిలో క్యాసినో ఏర్పాటు చేసి గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లను ప్రత్యేక అతిథుల కోసం రప్పించినట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా జూద క్రీడలు సాగుతుంటే సంక్రాంతి సంబరాలు అంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చేందుకు యత్నించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. ఎప్పటి మాదిరిగానే అత్యధిక బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం కాగా ఆ తర్వాత తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. భీమవరం, ఉండి, దెందులూరు, రావులపాలెంలో బరులు గోవా, శ్రీలంక క్యాసినోలను తలదన్నేలా ఏర్పాటయ్యాయి. గన్నవరం, నూజివీడు మధ్య మీర్జాపురం, బిళ్లనపల్లి గ్రామాల సమీపంలో ఏర్పాటైన పందేల బరి హైలైట్‌గా నిలిచింది. అక్కడికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రావడంతో ప్రత్యేకంగా వీవీఐపీ గ్లాస్ గ్యాలరీలు ఏర్పాటు చేసి క్యారవాన్లు, బౌన్సర్లను రంగంలోకి దించారు. ఏసీ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, రాత్రయితే ఫ్లడ్ లైట్లతో పందేల బరులు ఎగ్జిబిషన్లను తలపిస్తున్నాయి. ఈ గ్యాలరీల్లో ప్రవేశం రుసుం కింద రూ.2 వేలు చొప్పున వసూలు చేశారు. అతిథులకు సకల మర్యాదలు చేస్తున్నారు. స్థానిక వంటలు రుచి చూపించేందుకు వంట మాస్టర్లను రప్పించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో బరులను దగ్గరుండి పర్యవేక్షించారు. గురు, శుక్రవారం కోడి పందేలను వీక్షించారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేటతోపాటు యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో కోడి పందేలు భారీగా జరిగాయి. రాజమహేంద్రవరం రమేష్ జాక్‌పాట్..! రెండు రోజుల్లో రూ.2.50 కోట్లు.. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ సేతువ జాతి పుంజు, రాజమహేంద్రవరంవాసి రమేష్ డేగ జాతి కోడి పుంజుల మధ్య పందెం జరగ్గా డేగ జాతి పుంజు గెలిచింది. దీంతో రమేష్ పందెంలో రూ.1.53 కోట్లు నెగ్గారు. శుక్రవారం కనుమ రోజు నిర్వహించిన మరో పందెంలో రమేష్ రూ.90 లక్షలు గెలుచుకోవడం విశేషం. ఇన్నోవా కారు, బుల్లెట్లు.. రావులపాలెంలో పందెంలో గెలుపొందిన గ్రూపు రాయల్ ఎన్ఫీల్డ్ను సొంతం చేసుకుంది. ఏడు పోటీలకు ఆ గ్రూపు 6 పందేలలో గెలిచింది. మురమళ్లలో ఇన్నోవా కారు, బుల్లెట్ ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన బరిలో సర్వ హంగులు కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరం బరి వద్ద బిరియానీ పాయింట్లు, కోడి పకోడి సెంటర్లు, ఆహార పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా రూ.5 వేల కోట్ల జూదం..! చిన్న బరుల్లో పందేలు రూ.వేల నుంచి మొదలై రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెద్ద బరుల్లో రూ.లక్షల్లో మొదలై రూ.కోట్లకు చేరుకుంటున్నాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లోని 14 పెద్ద బరుల్లో రూ.వందల కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా రూ.200 కోట్ల వరకూ పందేలు జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో బరిలో రోజుకు 25 నుంచి 30 వరకు ప్రధాన పందేలు జరగ్గా, కనీస పందెం రూ.50 లక్షల నుంచి మొదలై రూ.కోటి వరకూ వెళ్లాయి. తాడేపల్లిగూడెం బెల్ట్‌లోనే రూ.250 కోట్ల మేర పందేలు జరిగినట్లు చెబుతున్నారు. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు పందేలు జరిగినట్లు అంచనా. భీమవరంలో భలే గిరాకీ.. భోగి పండుగ రోజు మొదలైన పందేలు సంక్రాంతి రోజు పతాక స్థాయికి చేరి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా బాబులతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల నుంచి జూదరులు తరలివచ్చారు. దీంతో హోటళ్లు, వాహనాల అద్దెలు, తాత్కాలిక వసతులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని పెద్ద హోటళ్లలో రూమ్ కోసం ఒక రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బౌన్సర్లు.. ‘జబర్దస్త్’ వినోదం⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోతాట, క్యాసినోల నిర్వాహకులు పగలు రాత్రి తేడా లేకుండా జూదాలు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు బరి నుంచి బయటకు రాకుండా సకల సదుపాయాలు కల్పించారు. ఈసారి మినీ ఏటీఎంలు వెలిశాయి. జబర్దస్త్ నటులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మాడుగుల హల్వా, సంగం డెయిరీ అవుట్ లెట్, ఐస్ బర్గ్ లాంటి ఐస్‌క్రీం స్టాల్స్ కనిపించాయి. పెద అమిరం బరి వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సినీ ప్రముఖులు పందేలు తిలకించారు. ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తుతోంది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీగా పందేలు నిర్వహించారు. కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ తదితరులు పందేలను వీక్షించారు. తూర్పు గోదావరి జిల్లాలో కడియం – వీరవరం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో క్యాసినో నిర్వహించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బరుల వద్ద భారీ పందేలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో బరి వద్ద రేగిన వివాదం కేతనకొండలో రెండు సామాజిక వర్గాల మద్య ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి శిబిరంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి పేకాట, క్యాసినో నిర్వహించారు. రూ.10 వేలు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్‌తో లోపలికి అనుమతించారు. పెనమలూరు నియోజకవర్గం ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో క్యాసినో తరహా జూద క్రీడలు సాగాయి. ఎంట్రీ టికెట్ రూ.లక్ష చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. కాకినాడ జిల్లాలో బరులకు వెళ్లే దారిలో రెండు కి.మీ. మేర ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి సెల్ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. ⇒ పిఠాపురం మండలం కందరాడలో జనసేన నేత ఆధ్వర్యంలో సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాట్లు చేసి కోడిపందేలు, గుండాట నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్ బహుమతిగా అందించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా పందేలు జరిగాయి. పూతలపట్టు మండలం బండపల్లిలో పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రూ.12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రణస్థలం మండల పరిధిలో కోడి పందేలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుల కనుసన్నల్లో పందేలు సాగాయి. అచ్యుతాపురం మండలంలో బెల్టు షాపులకు వేలం నిర్వహించారు. సబ్బవరం మండలం అమృతపురం, మొగలిపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోడిపందేలు, గుండాట నిర్వహించారు. టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ స్వగ్రామమైన మొగలిపురంలో పందేల వద్ద గొడవ జరిగింది. సుజాతనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకుని రాత్రంతా విద్యుత్ స్తంభాలకు కట్టేశారు. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కోడి పందాల బరులన్నీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఏర్పాటయ్యాయి. వారి సూచనల మేరకే పోలీసులు బరులకు అనుమతి ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముందే ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ముడుపుల బేరం కుదుర్చుకున్నాక పోలీసు అధికారుల వద్దకు వెళుతున్నారు. అక్కడ కూడా లంచాలు ఇచ్చాక తూతూమంత్రంగా కేసులు పెట్టేందుకు కొంతమందిని నిర్వాహకులే పోలీసులకు అప్పగిస్తున్నారు. వారిని పోలీసులు ముందే బైండోవర్ చేసి కొన్నిచోట్ల దాడి చేసి అరెస్టు చేసినట్లు చూపుతున్నారు. ఇందుకోసం స్టేషన్‌కి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
బాదం–జీడిపప్పుతో పెరిగిన పుంజులు, పందాల్లో పంచ్‌లు
శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం. వేకువ జామున నది, కాలువల్లో ఈత కొట్టించి, ప్రత్యేక వ్యాయామం చేయించి, బాదం పిస్తా పెట్టి పెంచుతారు. సాధారణ దాణాతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం తప్పని సరి. రాగులు, బియ్యం, పాలిష్ తవుడు రెండుసార్లు, దినుసులు, నూకలు, అన్నం బాగా కలిపి గోధుమలతో సిద్ధం చేసి రోజుకు ఐదారుసార్లు తినిపిస్తారు. అలాగే దాణా పెట్టిన ప్రతిసారి బాదం, జీడి పప్పు పెడతారు. బొబ్బిలి సెంటిమెంట్ పౌరుషానికి ప్రతీకంగా భావించే బొబ్బిలిని ఇక్కడ పందెందార్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. అక్కడ గుడ్లను తీసుకువచ్చి ఇక్కడ పొదిగిస్తారు. పండక్కి ఒక పది నెలలు ముందుగా పక్కా ప్రణాళిక ప్రకా రం చేస్తారు. పుట్టిన పుంజులను ఎంతో శ్రద్ధతో పెంచి పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతారు. బలిష్టంగా తయారవ్వడాని వాటికి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ జాతికే డిమాండ్.. కోడి పందాలను రెండు రకాలుగా పెడతారు. అందులో మొదటిది కాళ్లకు కత్తి కట్టి పందానికి దించితే పందెం ప్రారంభం నుంచి 20 నిమిషాలకు ముగు స్తుంది. రెండోది ‘డెంకీ’ ఈ పందెంలో కాళ్లకు కత్తి లేకుండా నేరుగా పుంజుకు పుంజుకు పోటీకి ఉసిగొల్పుతారు. ఇందులో రూ.లక్షలు పందెం కాసి, గంటలు కొద్దీ పందాలు జరుపుతారు. కాకి, డేగ, కాకి నెమలి, పింగళి, నెమలి, కాకిడేగ, కక్కిరి, పాసి వంటి జాతులకు డిమాండ్ బట్టి రూ.ఐదు వేలు నుంచి లక్ష వరకూ ఇస్తారు. నదీ తీర ప్రాంతాలతోపాటు కొండపక్కల ఉన్న గ్రామాల్లో పందెందార్లు ప్రస్తుత కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకులాం, అంబాజీపేట, జలుమూరు మండలం మాకివలస, పర్లాం, చెన్నా యవలస, సారవకోట మండలం బొంతు, పోలాకి మండలం గంగివలస, సరుబుజ్జిలి మండలం యరగాం, పెద్దసవలాపురం, తెలికిపెంట తదితర గ్రామాలలో ఈ కోళ్ల పెంపకం జరుగుతుంది. -
జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏపీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.తహసీల్దార్, ఎస్ఐలతో తనిఖీ బృందాలుసంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.కోడి పందేలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవసరమైతే 144 సెక్షన్ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉపయోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయవచ్చు’’ అని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. -
బరి కొద్దీ సిరి!
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతికి ముందే కూటమి నేతలు బరి తెగిస్తున్నారా? కోడిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడిపందేల కంటే బరులకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారా? బరి స్థాయిని బట్టి ధర నిర్ణయించేశారా? వసూళ్లకు ప్రణాళికలు రూపొందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సంక్రాంతి కోడిపందేలపై కూటమి ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరులు ఏర్పాటు చేయాలంటే తమ చేయి తడపాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా.. వసూళ్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటాలపై క్లారిటీ సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కోడిపందేల బరులపై చంద్రబాబు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరుల కోసం వేలం పాటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కో బరికి ఇంత ధర అని నిర్ణయించి మరీ వసూళ్లకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బరి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తం ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తోంది. ఎవరు బరి ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరి వాటా ఎంత అన్న వ్యవహారం మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పోలీసులు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కూటమి నేతల ప్రణాళికలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో జరిగిన సంక్రాంతి పండగకు కూటమి నేతలు భారీగా రంగంలోకి దిగారు. ప్రతి గ్రామంలో బరి ఉండేలా చక్రం తిప్పారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోపాలపురం, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతకుమించి కోడిపందేల బరులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన మధ్య పోటీ కోండిపందేల బరుల ఏర్పాటుపై టీడీపీ, జనసే నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తామే బరులు ఏర్పాటు చేయాలని ఓ వర్గం, కూటమిలో తామూ భాగమని, తమకూ బరులు కావాలని మరో వర్గం నేతలు పోటీపడుతున్నట్లు తెలిసింది. తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు. పోటీ అధికంగా ఉండటంతో బరులకు వేలం పాటలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్టు సమాచారం. ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే బరి దక్కేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పేకాట, గుండాటపై దృష్టి బరుల ఏర్పాటుకు పోటీ పెరుగుతుండటంతో కొందరు కూటమి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్నారు. కోడిపందేల ముసుగులో సాగే గుండాటలు, పేకాట, బొమ్మ, బొరుసు వంటి వాటిని జోరుగా నిర్వహించి సందట్లో సడేమియా అన్నట్లు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోట్లలో పందేలు గోదావరి జిల్లాలో రూ.వందల నుంచి రూ.కోట్లలో కోడిపందేలు జరుగుతుంటాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు బుల్లెట్లు, బైకులు బహుమతులుగా పెడుతున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు.సంక్రాంతంటే గోదావరి జిల్లాలే..ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ప్రబల తీర్థం, ఎడ్లబండి పోటీలు, గుర్రపు పోటీలు ఇలా ఎన్ని నిర్వహించినా.. కోడిపందేలు లేనిదే పండగ సందడి ఉండదు. ఇందులో భాగంగానే ఎవరు ఏమన్నా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆంక్షలు పెట్టినా.. కోడిపందేలు ఆడి తీరుతారు. దేశ, విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో గోదావరి జిల్లాలకు వస్తుంటారు. సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వచ్చేస్తారు. కుటుంబమంతా సరదాగా గడిపేందుకే గోదావరి జిల్లాల బాట పడుతుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, కోడిపందేల పేరుతో క్యాష్ చేసుకుంటున్నారు. సరదాగా, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన కోడిపందేలు డబ్బులే ప్రామాణికంగా జరుగుతున్నాయి. రూ.కోట్లల్లో పందేలు వేస్తున్నారు. సరదాగా చూసేందుకు వచ్చిన వారు సైతం అందులో పాల్గొని తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.వేలం పాటల ద్వారా కేటాయింపు కోడి పందేలు నిర్వహించే బరులను వేలం పాటల ద్వారా కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలన్న విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.20 లక్షల రూపాయల బరిలో ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీస్ స్టేషన్‌కు రూ.2 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రూ.10 లక్షల బరిలో కూడా ఇదే తరహాలో అందరూ సమానంగా పంచుకోవాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలన్న తలంపుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూటమి నేతలు వదలడం లేదు. వేలంపాట డబ్బు తమకు వదిలేయాలని గతేడాది పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కోరారు. ఈసారి కూడా అదే పంథా అవలంబించాలని అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
సంక్రాంతి కోట్లాటకు 'పుంజు'కుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసాని కుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ: పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరీ్ఫదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేరి్పస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం: బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. -
పందెం కోళ్లతో ఖాకీల కష్టాలు
ఒక చోట క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, బుకీలతో పాటు అక్కడ దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఒక ఇంట్లో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు. పోలీసులు పేకతో పాటు నగదు, తదితరాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. పోలీసులు దొరికిన పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద దొరికిన నగదుతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు..సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచే సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును, వస్తువులను కోర్టుకు అప్పగిస్తారు. కోడి పందేల కేసుల్లో కోళ్లను ఏం చేస్తారనేది ఆసక్తికర అంశం. ఈ కోళ్లను కొన్నాళ్ల వరకు కాచుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడి పందేలన్నీ రాజకీయ నాయకులు, పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. న్యాయస్థానాలు ప్రశ్నించినప్పుడో, మరేదైనా జరగరానిది జరిగినప్పుడో చూపించుకోవడానికి రికార్డుల కోసం పోలీసులు అప్పుడప్పుడు కొన్నిచోట్ల దాడులు చేస్తుంటారు. కోడి పందేలు ఆడుతున్న వారిని, పందేలకు సిద్ధమవుతున్న వారిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, నగదుతో పాటు కోళ్లను స్వాధీనం చేసుకుంటుంటారు. . పందెంరాయుళ్లను కోర్టులో హాజరుపరచే పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, దానికి ఆధారంగా కొన్ని ఫొటోలను సమర్పిస్తారు. న్యాయస్థానం నిందితులను బెయిల్‌పై వదలడమో, రిమాండ్‌కు పంపడమో చేస్తుంది. ఆపై విషయం కోళ్ల దగ్గరకు వస్తుంది. ఆ కోళ్లను గతంలో సేఫ్ కస్టడీలో ఉంచాలంటూ పోలీసులనే ఆదేశించేది. దీంతో పోలీసులు వాటిని ఠాణాల్లోనో లేదా సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనే కట్టేసి మేపుతుండే వాళ్లు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడం, అవి కోర్టు ప్రాపర్టీ కావడంతో తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేసేవాళ్లు.ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకునేవారు. ఈ విధానంలో అనేక ఇబ్బందులు వస్తుండటంతో కోర్టు కొన్నాళ్లుగా ఈ విధానాన్ని మార్చింది. కోళ్లను స్వాధీనం చేసుకున్న వెంటనే, వాటిని విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ కోళ్లను స్థానికంగా ఉండే పెంపకందారులకు, చికెన్ షాపుల నిర్వాహకులకు అప్పగించి ఎన్ని, ఏ రకానికి చెందినవో సూచిస్తూ రసీదు తీసుకుంటారు. వారి నుంచి వాంగ్మూలం కూడా నమోదు చేసుకుని, కోర్టుకు సమర్పిస్తారు. అలా ఓ సంరక్షకుడికి అప్పగిస్తున్న సమయంలో ఆ కోళ్లను తిరిగి పందేలకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం నమోదయ్యే ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యాక న్యాయస్థానంలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఆ సమయంలోనే కోళ్ల విక్రయానికి అనుమతిచ్చే న్యాయస్థానం ఓ రేటును ఖరారు చేస్తుంది. ఈ ధరకు కోళ్లను అప్పటి వరకు వాటి సంరక్షణ చూసిన వారికే అమ్మేసి, అలా వచ్చిన మొత్తాన్ని కోర్టులో జమ చేస్తారు. ఈ క్రతువులోనూ ఇటీవల కాలంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలా కోర్టులో జమ చేసిన మొత్తం కేసు విచారణ ముగిసి, ఫలితం తేలే వరకు బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. సరైన సాక్ష్యాధారాలు లేకనో, మరో కారణంగానో కేసు వీగిపోతే ఆ మొత్తం ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు, కేసు నిరూపితమై వారికి శిక్షపడితే కోర్టుకు వెళ్లిపోతుంది. ఇక్కడే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. కేసు వీగిపోయినప్పుడు కొందరు పందెంరాయళ్లు పోలీసుల వద్ద కొత్త మెలికలు పెడుతున్నారు. తమ కోళ్లు తమకు కావాలంటూ వాదిస్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఇటీవల ఒక కొత్త విధానాన్ని మొదలెట్టాయి. స్వాధీనం చేసుకున్న కోళ్లను మళ్లీ పందేలకు ఉపయోగించకుండా షరతులు వి«ధిస్తూ, నిందితులకే అప్పగించాలని చెబుతున్నాయి. కేసు విచారణ ముగిసి, వారిపై నేరం నిరూపణ అయితే మాత్రం అప్పుడు న్యాయస్థానం ఆ కోళ్లకు రేటు కట్టి, నిర్దేశిత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.ఈ పందెం కోళ్లు తమ స్వాధీనంలో ఉన్నన్నాళ్లూ పోలీసులు ఒక రకంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాల్సిన పరిస్థితే! ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పాటు కోళ్లను సంరక్షకుడికి అప్పగించే వరకు పోలీసులదే బాధ్యత. ఆలోపు ఆ కోళ్లకు ఏమైనా జరిగితే పోలీసులకు కొత్త పని వచ్చిపడుతుంది. వారి అధీనంలో ఉండగా అనారోగ్య, అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా లేదా తప్పించుకుని పోయినా, దానికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలి. చనిపోయిన కోడి కళేబరానికి ప్రభుత్వ పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించాలి. తర్వాత అధికారికంగా ఖననమో, దహనమో చేయించడమూ అనివార్యం. ఈ తంతులు పక్కాగా చేయడంతో పాటు ఆ రికార్డులను కోర్టులో దాఖలు చేయడం తప్పనిసరి. ఈ వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే, ఇలాంటి పందెం కోళ్లను కోర్టు అనుమతి తర్వాత సంరక్షకులు ఎక్కువగా చికెన్ పకోడీ సెంటర్లకు విక్రయించడం లేదా తామే పకోడీ చేసుకోవడం చేస్తుంటారు. డ్రైఫ్రూట్స్, పళ్లు వంటి పౌష్టికాహారం తిని పెరిగే ఈ కోళ్లతో చేసే కూర కంటే పకోడీనే బాగుంటుందని వాళ్లు చెబుతుంటారు. -
అమెరికాలోనూ కోడిపందేలు
సంక్రాంతి అంటేనే కోడిపందేలకు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాల పేరిట కోడిపందేలను ప్రభుత్వం నిషేధించినా, ‘తగ్గేదే లే’ అంటూ ఈ పందేలు ఏటా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోడిపందేల కోలాహలం అమెరికాకూ వ్యాపించింది. తాజాగా అమెరికాలో ఇద్దరు కోడిపందెం రాయుళ్లను కెంటకీ స్టేట్ పోలీసులు అరెస్టు చేశారు.వారి దగ్గర ఉన్న కోళ్లను స్వాధీనం చేసుకుని, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. మన దేశంలో జరిగే కోడిపందేల్లాగానే అమెరికాలోనూ కోడిపందేలు జరుగుతుంటాయి. బరిలోకి దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పందేలు కాస్తుంటారు. పందేల కోసం పుంజులను సుమారు ఏడాది పాటు పుష్టిగా పెంచుతారు. పందెంకోళ్లకు పెట్టే ఆహారానికి, వాటి ఆరోగ్యానికి భారీగా ఖర్చు చేస్తుంటారు. ఏది ఏమైనా కత్తులతో కుత్తుకలు తెగేలా సాగే పుంజుల పోరాటాలు ఏ దేశంలో జరిగినా, చూడటానికి వచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. -
వైరల్: కోడిపందాల్లో లేడీ బౌన్సర్లు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్‌లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్‌రూమ్‌ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్‌నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
చచ్చినా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: తెలుగు నేలపై సంక్రాంతి సీజన్ అంటే పందెంకోళ్ల పౌరుషం గుర్తొస్తుంది. పందెంలో గెలిచినా.. ఓడినా మాంసాహార ప్రియులు పుంజులను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. పందెంలో ఓడిపోయిన, చనిపోయిన పుంజును తూర్పు గోదావరి జిల్లాలో ‘కోస’ అని పశ్చిమ గోదావరిలో ‘కోజ’ అని వ్యవహరిస్తారు. వీటి మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. ఏనుగు చచ్చినా బతికినా విలువ తగ్గదన్నట్టు పందెం పుంజైనా, పోరాటంలో మరణించిన ‘కోజ’ అయినా ధర వేలల్లో ఉంటుంది. బరువును బట్టి ఇవి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతాయి.పుష్టికరమైన ఆహారం..పందెం కోడిని మేపినట్లు మేపామనే సామెతను బట్టి పందెం పుంజులను ఎంత శ్రద్ధగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. శక్తి కోసం నాటు పుంజులకు ఉడకబెట్టిన మటన్, డ్రై ఫ్రూట్స్, కోడి గుడ్లు, వెల్లుల్లి లాంటి బలవర్థకమైన ఆహారాన్ని నెలల తరబడి అందిస్తారు. శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగిరేందుకు వాటితో ఈత, నడక వ్యాయామాలు చేయిస్తారు. ప్రత్యేకంగా పెంచిన ఈ తరహా పుంజులు రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో ధర పలికితే మిగిలినవి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటాయి. ప్రత్యేకమైన రుచి.. పందెంకోళ్లను మటన్, బాదం, జీడిపప్పు, పిస్తా లాంటి ఖరీదైన మేతతో పుష్టిగా మేపి వ్యాయామాలు చేయించడం వల్ల వాటి శరీరంలో కొవ్వు లేకుండా కండ ఎక్కువగా ఉంటుంది. పందెంలో ప్రత్యర్థి పుంజుపై గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డిన సమయంలో రక్తం మరింత వేడెక్కి ప్రత్యేకమైన రుచి వస్తుందని మాంసాహార ప్రియుల నమ్మకం. అందుకోసమే ఎంత ఖరీదైనా వెనుకాడకుండా వీటిని కొనుగోలు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులకు వండి పెట్టి.. కొందరు పందేలరాయుళ్లు ‘కోజ’లను తమ వెంట తీసుకెళ్లిపోతే మరి కొందరు బరి బయటే అమ్మేస్తుంటారు. పుంజు బరువును బట్టి ధర పలుకుతుంది. ప్రత్యేకంగా వీటిని నిప్పులపై కాల్పించుకుని దగ్గరుండి కావాల్సిన సైజుల్లో ముక్కలు కొట్టించి మాంసాన్ని తీసుకువెళుతుంటారు. వీటిని కొనేందుకే కొందరు బరుల వద్దకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. పందెం పూర్తి కాగానే పరుగులు తీస్తుంటారు.పండుగ నాడు ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు ‘కోజ’ పుంజులను వండి పెట్టి ఆనందంగా గడుపుతారు. తెలిసిన వారికి మాంసాన్ని పంపేందుకు ఆసక్తి చూపుతారు. పందెం అనంతరం ‘కోజ’ను తమకే ఇవ్వాలని పందేలరాయుళ్లకు ముందుగానే చెబుతారు. ‘పెద్దలకు’ కానుకగా.. సంక్రాంతి సమయంలో సామాన్యులే కాకుండా కొందరు నాయకులు, ఉద్యోగులు సైతం తమ పైవారికి ‘కోజ’లను కానుకగా పంపించి ప్రసన్నం చేసుకుంటారు. పందేల నిర్వాహకులు ఒక్కో బరి నుంచి 25కిపైగా ‘కోజ’లను సేకరించి రాజకీయ నాయకులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ అధికారులకు పంపిస్తుంటారు. స్టేషన్ మామూళ్ల విషయాన్ని పక్కనపెడితే తమకు ఎన్ని ‘కోజ’లు పంపాలో పోలీసులు ముందే ఇండెంట్ పెడతారని పందేలరాయుళ్లు అంటుంటారు. కోట్లు కురిపిస్తున్న ‘కోజ’ ‘కోజ’ల రూపంలో పండుగ మూడు రోజులూ ఒక్కొక్క బరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నా పెద్దా కలిపి దాదాపు 80 కోడిపందేల బరులు ఏర్పాటు కానుండగా ‘కోజ’లపై రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
-
సంక్రాంతి స్పెషల్: 'పందెం కోడి' వామ్మో ఇంత రేటా?
‘ఎత్తర కోడి తిప్పర మీసం’ అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా. మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, సేవల, నల్లబోర, ఎర్రపొడ.. ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు.. కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. ఇవి చదవండి: మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట -
కోడిపందేల కట్టడికి పటిష్ట చర్యలు..‘బరి’తెగిస్తే ఖబడ్దార్
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): సంక్రాంతి పండగకు సంప్రదా యం పేరుతో జరిగే కోడిపందేల కట్టడికి పోలీసుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేలు, జూదాలను అడ్డుకోవడంపై జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పందేలకు బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నిర్వాహకులతో మాట్లాడటం, జూదాలు నిర్వహించిన వారిని ముందుస్తు బైండోవర్ చేయడం, కోడి కత్తులు తయారీ, కట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేయడం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పందేల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుచేసి కత్తులు తయారుచేసేవారిని 155 మంది గుర్తించి 50 కత్తులను సీజ్ చేశారు. గ్రామస్తుల సహకారంతో కట్టడి సంక్రాంతి జూదాలను కట్టడి చేయడానికి పోలీసుశాఖ గ్రామస్థాయి కమిటీల సమన్వయంతో పనిచేస్తోంది. ప్రతి గ్రామంలో వలంటీర్లు, సచివాలయ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండటంతో ముందుస్తుగా బరులను సిద్ధం చేస్తున్న ప్రాంతాలపై సమాచారం సేకరిస్తున్నారు. గతంలో పందేలు వేసిన బరుల స్థల యజమానులకు ముందస్తు నోటీసులిచ్చి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విస్తృత తనిఖీలు గ్రామాల్లో పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పందేలను సిద్ధం చేస్తున్న బరులను, పందేలకు అనువుగా ఉన్న స్థలాలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేయిస్తున్నారు. అలాగే గతంలో పందేలు నిర్వహించిన జూదరులను హెచ్చరించడంతో పాటు అనర్థాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏటా జిల్లావ్యాప్తంగా మూడు రోజులుపాటు కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రధానంగా భీమవరం, కాళ్ల, యలమంచిలి, మొగల్తూరు, పెంటపాడు, త ణుకు, పెనుగొండ, అత్తిలి, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, ఆకివీడు మండలాల్లో భారీ పందేలు జరుగుతుండటంతో పోలీసు అ«ధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. కఠిన చర్యలు సంక్రాంతికి సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదాలు ని ర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సుమారు 2 వేల మందికి పైగా కేసులు నమోదు చేశాం. జూదాల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. పండగలకు ఆనందంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కోళ్లు లాక్కున్నందుకు టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. !
సాక్షి, అనంతపురం : కోడి పందేలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అధికార జులుం ప్రదర్శించారు. వివరాలు.. పందేలు నిర్వహించనున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం అంకాలమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. పందేలకు సిద్ధంగా ఉన్న నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకుని జీపులో వేసుకుని వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వారి జీపును చేజ్ చేశారు. పోలీసుల జీపునకు అడ్డం తిరిగి వీరంగం సృష్టించారు. ఏఎస్సై తిరుపాల్‌పై దౌర్జన్యం చేశారు. కోళ్లు లాక్కుని పందెం రాయుళ్లకు అప్పగించారు. ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే ఊరుకోనని పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే పరుష పదజాలంతో తిట్టడంతో పోలీసులు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోడి పందాళ్లో పలువురికి గాయాలు.. గుడివాడ : అధికార పార్టీ నాయకుల అండదండలతో గుడివాడలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వలంటీర్‌గా ఉండి పందేలను వీక్షిస్తున్న ఓ వ్యక్తిపై టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలవారు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వారిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. -
వారిపై కేసులు నమోదు చేయండి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు చెరుకుపల్లి పోలీసులను ఆదేశించింద ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది భానుప్రకాశ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
భలే భలే...కోజా!
సాక్షి, నిడదవోలు: సంక్రాంతి సీజన్లో భోజన ప్రియులకు నోరూరించే పందెం కోడికి (కోజా)కు ప్రతీ ఏటా యమ డిమాండ్ ఉంటుంది. రేటు ఎంతైనా దీన్ని కొనడానికి ఆశక్తి చూపుతారు. సాధారణ రోజుల్లో నాటు కోడి పుంజుకు ఉన్న ధరక 4 రెట్లు అధనంగా కోజా సైజును బట్టి 3 వేల రూపాయల నుంచి 6 వేలకు ధర పలుకుంది. అమ్మడానికి ఎవరైనా ముందుకు వస్తే కొనడానికి జనాలు ఎగబడుతున్నారు. పందెంలో ఓడిపోయిన కోడి పుంజును కోజా అంటారు. దీని రుచికి భోజన ప్రియులు దాసోహమవుతారు. ఎంతైనా వెచ్చించి కోజాను కొనుగోలు చేస్తారు. కొందరైతే కోజాను తినకపోతే అసలు సంక్రాంతి పండుగ చేసుకున్నట్లుగా భావించరు. దూర ప్రాంతాల నుండి సంక్రాంతికి గ్రామాలకు ఇంటికి వచ్చే ముందు ముఖ్యంగా కోజా గురించి ఆరా తీస్తారు. బంధువులు ముందు పరువు దక్కించుకోవడం కోసం ఎంతకైనా కోజాను కొనడానికి వెనకాడరు. పందెం రాయుళ్ళు రకరకాల పదార్ధాలతో పందెం కోళ్ళను పెంచుతారు. నాటు కోళ్ళను సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటారు. ఇలాంటి పుంజులు కోసి కూర వండుకుని తింటే అహా..ఏమి రుచి అనకమానరు. ఎంతటి వారయినా కోజా రుచికి దాసోహం కాక తప్పదు. -
పెద్దపల్లి టు కోనసీమ
► పెద్ద సంఖ్యలో తరలుతున్న పుంజులు ►పందెం కోళ్లకు అక్కడ మంచి డిమాండ్ ►జిల్లాలో విరివిగా పెంపకం పెద్దపల్లి : కోడి పందేలపై జిల్లా ప్రజలకు పెద్దగా ఆసక్తి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పందెం కోళ్లు మా త్రం విరివిగా పెంచుతున్నారు. వీటిని కోనసీమ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతోపాటు కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, ధర్మా రం మండలాల్లోని పలు గ్రామాల్లో నాటుకోళ్లు పెంచుతున్నవారు పందెం కోళ్లనూ పెంచుతున్నారు. గతంలో ఇక్కడ పెంచిన పందెం కోళ్లను సంక్రాంతి సందర్భం గా శివపల్లి, బెల్లంపల్లి, చందోలి, శ్రీరాంపూర్లోసాగే పందేలకు తీసుకెళ్లేవారు. రెండేళ్లుగా ఈ ప్రాం తంలో పందేలపై నిషేధం విధించారు. అయినా పందెం కోళ్ల పెంపకం మాత్రం నిరాటంకంగానే కొనసాగుతోంది. నాటుకోళ్లు(పెరటికోళ్లు) పెంచుకునేవారు వాటితోపా టు పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోళ్లకు కిలో చొప్పున మామూలు ధర ఉండగా, పందెం కోళ్లకు మం చి డిమాండ్ ఉంటుంది. ఒక్కో కోడిపుంజు పెంపకం కోసం సాధారణంగా వాడే విత్తనాలు కాకుండా బా దాం, ఖాజు లాంటి విలువైన పోషక పదార్థాలు వాడడంతో ఏడాదిలోనే పందెం కోడి నాలుగైదు కిలోలకు చేరుకుంటుంది. ఒక్క పుంజు ఖరీదు రూ.2 వేల నుంచి 5 వేలు పలుకుతోంది. రహస్యంగా వ్యాపారులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన పందెం కోళ్లను సంక్రాంతి సీజన్ సమయంలో కోనసీమ ప్రాంతంలో జరిగే పోటీ ల్లో పాల్గొనే పందెంరాయుళ్లకు విక్రయిస్తున్నారు. స్థాని కంగా లభిస్తున్న కోళ్లకు కోనసీమ ప్రాంతంలో రూ.10వేల వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. అలాగే చంద్రాపూర్ ప్రాంతంలోనూ ఇదే ధర ఉంటుం దని అంటున్నారు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై శ్రద్ధచూపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పం దెం కోడి పిల్ల ఖరీదు రూ. 300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. దీనిని పెద్ద సనుగు అంటూ విక్రయిస్తుంటారు. ఏడాదిలో పెట్టిన పెట్టుబడి పదింతలవుతుంది. దీంతో నాటుకోళ్లు రెండు గంపలుగా పెంచడం కన్నా నాలుగు పందెం కోళ్లను పెంచితే రెట్టింపు లాభం వస్తుందని పెంపకందారులు అంటున్నారు. -
కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదు
- సంక్రాంతి పోటీలకు హైకోర్టు బ్రేక్ - నిబంధనల అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలి సాక్షి, హైదరాబాద్: కోడి పందేల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ పందేలకు ప్రజా ప్రతినిధులు హాజరవుతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తూ, ఇతరులకూ చట్ట ఉల్లంఘనలకు పాల్పడే ధైర్యాన్నిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా చూసేందుకు ముఖ్యంగా తూర్పు , పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంయుక్త పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ బృందంలో ఎస్ఐ స్థాయికి తగ్గని అధికారి, తహసీల్దార్, జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా స్వచ్ఛంద సంస్థ సభ్యుడుగానీ ఉండాలంది. వీటిని జనవరి 7, 2017లోపు ఏర్పాటు చేయాలని, ఈ బృందానికి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్ సహకారం అందించేలా చూడాలంది.కోళ్ల పందేలకు ఉద్దేశించిన ఏ ప్రాంతాన్నైనా సందర్శించేందుకు ఈ బృందాలకు అధికారం ఉందన్న హైకోర్టు, పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, డబ్బును జప్తు చేయవచ్చునంది. జంతు హింస నిరోధకచట్టం, ఏపీ గ్యాంబ్లింగ్ చట్ట నిబంధనల పూర్తిస్థాయి అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. నిబంధనల అమలులో లోపం జరిగితే అందుకు వారు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించిం ది. పందేలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్, కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిల్లను, పందేలకు అనుమతివ్వాలని పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
కోడి పందేల స్ధావరంపై పోలీసుల దాడి
మేడ్చల్: హైదరాబాద్ శివార్లలో కోడిపందేల స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం దాడి చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ తండాలో కొంతకాలంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఫాంహౌజ్‌పై దాడి చేసి కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్ఫోన్లు, 4 కోళ్లు, 8 కత్తులతో పాటు రూ.25,230 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌజ్ యాజమన్యంతో పాటు పందేలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
-
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కోడిపందాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నలుగురు యువకులు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని నూజివీడు తరలించారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న ఆగిరిపల్లి పోలీసులు కృష్ణవరం చేరుకున్నారు. ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు కృష్ణవరంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
కోడిపందాలను ప్రారంభించిన 'ఎమ్మ్ల్యే'
-
కోడిపందాలపై దాడులు : పలువురు అరెస్ట్
నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమోడిలో కోడి పందాలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 9 సెల్ ఫోన్లు, 5 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గదుల్లేవంటూ చేతులెత్తేసిన హొటళ్లు
-
హాట్‌టాపిక్‌గా మారిన కోడిపందాల వ్యవహారం
-
పందెం ఉందా ?..లేదా ?..
-
ముందు నుయ్యి..వెనుక గొయ్యి!
-
'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ!
పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పంచాయతీ మొదలైంది. రాబోయే సంక్రాతి పండుగకు కోడి పందాల కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి ఎస్పీ బదిలీ చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎస్పీ ఉంటే తమ పందాలకు ఆటంకం కలుగుతుందనే యోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పందెం కోళ్ల పంచాయతీని ఏకంగా చినబాబు వద్దకు తీసుకొచ్చారని.. అయితే ఈ అంశం ఆయనకు మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీ బదిలీపై కొంతమంది బీజేపీ నేతలు, టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కోడి పందాల కోసం ఎస్పీని బదిలీ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఆ కోళ్లకు జీడిపప్పుతో గుడ్ మార్నింగ్!
సంక్రాంతి వస్తోందంటే చాలు.. కోడిపందాల జోరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పందేల్లో తలపడే కోళ్లకు ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. పౌరుషం రావడం కోసం రకరకాల ఆహారాలు పెడతారు. మరి అలాంటి కోళ్ల రేట్లు కూడా మామూలుగా ఉండవు కదా. అందుకే విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓ యువకుడు ఈ కోళ్ల పెంపకాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు. అతడిపేరు నూకనాయుడు. వివిధ జాతులకు చెందిన కోళ్లను పెంచుతూ వాటిని పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతున్నారు. వాటికి జీడిపప్పుతో గుడ్‌మార్నింగ్ చెప్పి.. తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, ఉడకపెట్టిన గుడ్లు, జొన్నలు, రాగులు ఇలా ప్రొటీన్ ఫుడ్డునే ఆహారంగా ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివిన నూకనాయుడు... స్వయం ఉపాధిగా ఈ కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు. డ్రైఫ్రూట్స్ పెట్టి పెంచుతున్న ఈ కోళ్లను... సైజును బట్టి 5 వేల నుంచి 50వేల రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. సంక్రాంత్రి దగ్గరపడటం.. కోడిపందాలు జోరందుకోవడంతో నూకనాయుడు కోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ధర ఎంతైనా సరే... ఇలాంటి పుంజులే కావాలంటున్నారు పందెంరాయుళ్లు.


