'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ! | cock fighting | Sakshi
Sakshi News home page

'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ!

Jan 8 2015 1:31 PM | Updated on Mar 29 2019 9:31 PM

'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ! - Sakshi

'పశ్చిమ'లో పందెం కోళ్ల పంచాయతీ!

పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పంచాయతీ మొదలైంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పంచాయతీ మొదలైంది. రాబోయే సంక్రాతి పండుగకు కోడి పందాల కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి ఎస్పీ బదిలీ చేయాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎస్పీ ఉంటే తమ పందాలకు ఆటంకం కలుగుతుందనే యోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఈ పందెం కోళ్ల పంచాయతీని ఏకంగా చినబాబు వద్దకు తీసుకొచ్చారని.. అయితే ఈ అంశం ఆయనకు మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీ బదిలీపై కొంతమంది బీజేపీ నేతలు, టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కోడి పందాల కోసం ఎస్పీని బదిలీ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement