దాడులను ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు | YSRCP candidates file nominations braving attacks | Sakshi
Sakshi News home page

దాడులను ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు

Oct 17 2026 5:16 AM | Updated on Oct 17 2026 6:04 AM

YSRCP candidates file nominations braving attacks

తొలిరోజు మేయర్‌ పదవులకు మొత్తం 6 నామినేషన్లు

వీటిలో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు 2

922 కార్పోరేటర్‌ పదవులకు 274 నామినేషన్లు దాఖలు.. అందులో వైఎస్సార్‌సీపీవీ 161

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు 43 నామినేషన్లు.. వీటిలో వైఎస్సార్‌సీపీవి 13

3021 కౌన్సిలర్‌ పదవులకు తొలి రోజు మొత్తం 367 నామినేషన్లు దాఖలు

వీటిలో 190 నామినేషన్లు వైఎస్సార్‌సీపీవే

సాక్షి, అమరావతి : అధికార తెలుగుదేశం పార్టీ అల్లరిమూకల దాడులు, విధ్వంసాలను ఎదుర్కొంటూనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు వెరవలేదు. అధికార టీడీపీ కూటమికంటే ఎక్కువగా వైఎస్సార్‌సీపీ నామినేషన్లే దాఖలయ్యాయి. 13 నగర కార్పోరేషన్లకు గాను పది చోట్ల, 87 మున్సిపాలిటీలకు 34 చోట్ల తొలి రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 13 నగర కార్పోరేషన్లలో 13 మేయర్‌ పదవులకు తొలిరోజు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ తరుఫున రెండు దాఖలయ్యాయి. అన్నా వైఎస్సార్‌ పార్టీ నుంచి మూడు, ఏఏపీ ఒక నామినేషన్‌ దాఖలయ్యాయి. 87 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు 43 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 చోట్ల వైఎస్సార్‌సీపీ, 15 మంది టీడీపీ తరుఫున నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన తరుఫున ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఒకరు, ఐదుగురు స్వతంత్రులు, ఇతరులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. 

కార్పోరేషన్లలో 922 కార్పోరేటర్‌ పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. తొలిరోజు 274 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో వైఎస్సార్‌సీపీ తరుఫున అత్యధికంగా 161 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 87 మున్సిపాలిటీల్లో 3021 వార్డు కౌన్సిలర్‌ పదవులకు తొలి రోజు మొత్తం 367 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో అత్యధికంగా 190 నామినేషన్లు వైఎస్సార్‌సీపీవే. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement