breaking news
Claude AI
-
దశాబ్దాల చిక్కుముడులు విప్పిన ‘అస్ట్రా’!
కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన ఓపెన్ మాథ్స్ సమస్యలను తమ తదుపరి తరం మోడల్ అస్ట్రా (Astra) పూర్తిస్థాయిలో సాధించిందని ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే పోటీ సంస్థ ఆంత్రోపిక్ స్పందిస్తూ తమ ‘క్లాడ్ ఫేబుల్’ మోడల్ ద్వారా వాటిలో ఐదు సమస్యలను కేవలం 24 గంటల్లోనే పరిష్కరించామని ప్రకటించి ఏఐ రేసును మరింత వేడెక్కించింది.ఓపెన్-ఏఐ ప్రచురించిన 249 పేజీల సమగ్ర నివేదిక ప్రకారం.. ‘అస్ట్రా’ మోడల్ గ్రూప్ థియరీ, క్వాంటమ్ కాంప్లెక్సిటీ, ఎక్స్ట్రీమల్ కాంబినేటోరిక్స్, స్పియర్ ప్యాకింగ్ డెన్సిటీ వంటి విభాగాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాని 10 సమస్యలను ఛేదించింది.1999లో మిఖాయిల్ గ్రోమోవ్ ప్రతిపాదించిన 'నాన్-సోఫిక్ గ్రూప్స్' ఉనికిని నిరూపించడంతో పాటు 'కానెస్ రిజిడిటీ కాంజెక్షన్'ను తిరస్కరించింది.ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ ప్రతిపాదించిన సమస్యలకు స్పష్టమైన ఆధారాలు అందించింది.కంప్యూటర్ల ద్వారా లైన్-బై-లైన్ తనిఖీ చేయగల లీన్ 4 (Lean 4) డిజిటల్ సర్టిఫికేట్లతో సహా ఈ పరిష్కారాలను గిట్‌హబ్‌లో అందుబాటులో ఉంచారు.ఈ మొత్తం ప్రక్రియకు అయిన టోకెన్ కంప్యూటింగ్ వ్యయం కేవలం 2,000 డాలర్లు (సుమారు రూ.1.9 లక్షలు) కావడం గమనార్హం.ధీటుగా ఆంత్రోపిక్ సవాలుఓపెన్-ఏఐ నివేదికపై ఆంత్రోపిక్ రీసెర్చర్ లీవెంట్ అల్పోజ్ స్పందిస్తూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ క్లాడ్ ఫేబుల్ మోడల్ ఎటువంటి ఇంటర్నెట్ సహాయం లేకుండా స్వయంప్రతిపత్తితో ఆ 10 సమస్యల్లో ఐదు సమస్యలను 24 గంటల్లోనే ఛేదించిందని సోషల్ మీడియాలో ఆధారాలు ప్రదర్శించారు.మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమనుకున్న అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సామర్థ్యాన్ని పొందే దిశగా ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ గణిత సమాజం ఈ ఆధారాలను పీర్-రివ్యూ ద్వారా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సాంకేతిక దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ సైంటిఫిక్ పోటీ భవిష్యత్ పరిశోధనల వేగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట.. -
క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.భద్రతా హామీలతో లభించిన ఊరటఆన్లైన్లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్‌గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.నిపుణులు ఏమంటున్నారు?ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
‘క్లాడ్ 5’ విడుదలకు ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ (Anthropic) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ మోడల్ ‘క్లాడ్ మైథోస్ 5’ (Claude Mythos 5) విడుదలకు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా విధించిన రెండు వారాల నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ, దేశంలోని సుమారు 100కు పైగా భాగస్వామ్య సంస్థలకు దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు వాణిజ్య విభాగం అనుమతించింది.లూత్నిక్ లేఖతో వీడిన ఉత్కంఠఅమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లూత్నిక్, ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కంప్యూట్ ఆఫీసర్ టామ్ బ్రౌన్కు పంపిన అధికారిక లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏఐ మోడల్‌కు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 12న జారీ చేసిన లేఖ తదనంతరం ఆంత్రోపిక్ సంస్థ ప్రభుత్వంతో కలిసి భద్రతా పరమైన లోపాలను సరిదిద్దడంలో గణనీయమైన పురోగతి సాధించిందని లూత్నిక్ వెల్లడించారు. ఈ అనుమతితో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు వందకు పైగా ప్రతిష్టాత్మక సంస్థలు మైథోస్ 5 ని ఉపయోగించుకోనున్నాయి. అలాగే ఈ సంస్థల్లోని విదేశీ ఉద్యోగులు కూడా దీనిని యాక్సెస్ చేయడానికి అనుమతి లభించింది.అసలు నిషేధానికి కారణం ఏంటి?చైనాకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఒక దక్షిణ కొరియా టెలికాం కంపెనీకి ఆంత్రోపిక్ సంస్థ ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ ఇవ్వడం అమెరికా ప్రభుత్వంలో తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పాటు అమెజాన్, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లు కూడా ‘ఫేబుల్ 5’ మోడల్ జైల్బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ జాతీయ భద్రతా కారణాల వల్లనే ట్రంప్ ప్రభుత్వం రెండు వారాల క్రితం ఆంత్రోపిక్ అత్యంత శక్తివంతమైన మోడళ్లపై ఎగుమతి నియంత్రణల కింద నిషేధం విధించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆంత్రోపిక్ తన సీనియర్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ సేఫ్టీ బృందాలను వాషింగ్టన్కు పంపి ప్రభుత్వంతో చర్చలు జరిపింది.వినియోగదారులకు నిరాశేనా?ఈ తాజా నిర్ణయం ప్రకారం మైథోస్ 5 కేవలం సైబర్ రక్షకులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలకే పరిమితం కానుంది. సాధారణ వినియోగదారుల కోసం దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఆంత్రోపిక్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, ‘ఫేబుల్ 5’ మోడల్‌ను తిరిగి సాధారణ వినియోగంలోకి తీసుకురావడానికి వైట్ హౌస్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఆంత్రోపిక్ ప్రతినిధి ఎడ్వర్డో మైయా సిల్వా తెలిపారు. కాగా, ఈ పరిణామానికి సరిగ్గా ఒక రోజు ముందే, ఓపెన్ ఏఐ తన రాబోయే ‘జీపీటీ 5.6’ మోడల్‌ను నేరుగా కాకుండా ప్రభుత్వం ఆమోదించిన భాగస్వాములకు మాత్రమే విడతల వారీగా విడుదల చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశించడం గమనార్హం. -
ఆంత్రోపిక్‌తో చేతులు కలిపిన టీసీఎస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ భాగస్వామ్యంతో ఎంటర్ప్రైజ్ ఏఐ స్కేలింగ్‌ను వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఐటీ రంగంలో సాంప్రదాయ శ్రమ-ఆధారిత నమూనాపై జనరేటివ్ ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.50,000 మంది ఉద్యోగులకు ‘క్లాడ్ ఏఐ’ శిక్షణఈ వ్యూహాత్మక కూటమిలో భాగంగా ఆంత్రోపిక్ సంస్థకు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్ ‘క్లాడ్’ వినియోగంలో దాదాపు 50,000 మంది టీసీఎస్ అసోసియేట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాల కోసం ఇరు సంస్థలు సంయుక్తంగా సరికొత్త ఏఐ పరిష్కారాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. క్లాడ్ ఏఐకి ఉన్న డేటా సెక్యూరిటీ, అక్యూరసీ ఫీచర్లు కార్పొరేట్ క్లయింట్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు దోహదపడతాయని కంపెనీ అధికారులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ఆందోళనలుభారతదేశానికి చెందిన సుమారు 315 బిలియన్ డాలర్ల ఐటీ రంగం ప్రస్తుతం ఒక కీలక సంధిగ్ధ దశను ఎదుర్కొంటోంది. సాంప్రదాయ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ వంటి శ్రమ-ఆధారిత పనులను ఏఐ సాధనాలు భర్తీ చేస్తే ఐటీ కంపెనీల ఆదాయ నమూనా దెబ్బతింటుందనే భయాలు పెట్టుబడిదారులలో నెలకొన్నాయి.శ్రామిక శక్తిలో మార్పులుటాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భవిష్యత్తు వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కంపెనీ శ్రామిక శక్తిలో మానవ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో, అంతే సంఖ్యలో ఏఐ ఏజెంట్లు కూడా ఉండేలా టీసీఎస్ అడుగులు వేస్తోంది. ఈ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో కొత్త నియామకాల వేగం మందగించే అవకాశం ఉందని చంద్రశేఖరన్ సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ తన శక్తివంతమైన, అత్యాధునిక ‘మైథోస్’ క్లాస్‌కు చెందిన మొదటి మోడల్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5)ను ఓపెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, కాంప్లెక్స్ నాలెడ్జ్ వర్క్ వంటి రంగాల్లో అత్యంత అసాధారణమైన సామర్థ్యాలు ఉన్న ఈ మోడల్ భద్రతాపరంగా కొన్ని కఠినమైన పరిమితులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.గతంలో ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ప్రివ్యూను ప్రకటించినప్పుడు ఇది ప్రపంచంలోని ఏ సాఫ్ట్వేర్నైనా హ్యాక్ చేయగల శక్తివంతమైనదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ ముప్పుపై భారతదేశంతో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం సైబర్ దాడుల ప్రణాళికల కోసం మైథోస్‌ను ఉపయోగిస్తోందనే నివేదికలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ తీవ్రమైన భద్రతా సవాళ్లను అధిగమిస్తూ గరిష్ట రక్షణ వలయాలతో ఆంత్రోపిక్ ఈ సరికొత్త మోడల్‌ను రంగంలోకి దించింది.క్లాడ్ ఫేబుల్ 5 అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్లాడ్ ఫేబుల్ 5’ అనేది ఇప్పటివరకు కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేసిన మోడళ్లన్నింటికంటే అత్యంత సమర్థవంతమైనది.అసాధారణ పనితీరు: సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన విశ్లేషణాత్మక పనుల్లో ఇది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. కొన్ని అంతర్జాతీయ బెంచ్మార్క్ల్లో ఇది కంపెనీ ప్రస్తుత టాప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ కంటే 10 శాతం ఎక్కువ స్కోరు సాధించింది.జైల్బ్రేక్ రక్షణ: మోడల్ విడుదలకు ముందు కంపెనీ అంతర్గతంగా 1,000 గంటలకు పైగా ‘బగ్ బౌంటీ’ పరీక్షలను నిర్వహించింది. అలాగే ‘రెడ్-టీమింగ్’ సంస్థల ద్వారా కూడా పరీక్షించగా ఎక్కడా ఈ మోడల్ భద్రతా వలయాన్ని చేధించే లూప్‌హోల్స్ కనిపించలేదని స్పష్టం చేసింది.టాస్క్ కాంప్లెక్సిటీ: పని ఎంత సుదీర్ఘంగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే ఇతర మోడళ్లతో పోలిస్తే ఫేబుల్ 5 అంతటి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది.అత్యంత కఠినమైన భద్రతా చర్యలుమైథోస్ క్లాస్ మోడళ్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్, కెమికల్ రంగాల్లో ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ మోడల్లో వినూత్నమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది.ఫాల్‌బ్యాక్ మెకానిజంఒకవేళ వినియోగదారు ఎవరైనా రిసిన్(ఒక రకమైన ప్రాణాంతక విషం) ఎలా తయారు చేయాలి? వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలను అడిగితే ఫేబుల్ 5 ఆ ప్రశ్నను బ్లాక్ చేస్తుంది. వెంటనే ఆ సెషన్ సురక్షితమైన ‘క్లాడ్ ఓపస్ 4.8’ మోడల్‌కు బదిలీ అవుతుంది. తద్వారా హానికరమైన సమాచారం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి రక్షణల వల్ల దాదాపు 95 శాతం సెషన్లు పూర్తిగా ఫేబుల్ 5 లోనే నడుస్తాయని, కేవలం 5 శాతం లోపు అత్యంత సున్నితమైన కేసుల్లో మాత్రమే ఓపస్ 4.8 కి ట్రాన్స్ఫర్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.చైనా వ్యూహాలకు బ్రేక్చైనాకు చెందిన కొన్ని ఏఐ కంపెనీలు తమ సొంత మోడళ్లకు శిక్షణ ఇచ్చుకోవడానికి క్లాడ్ మోడల్‌ను డిస్టిలేషన్ (పెద్ద మోడల్ డేటా ఆధారంగా చిన్న మోడళ్లను తయారు చేయడం) చేస్తున్నాయని ఆంత్రోపిక్ గతంలో ఆరోపించింది. అయితే, ఫేబుల్ 5 లో పొందుపరిచిన యాంటీ-డిస్టిలేషన్ రక్షణలు ఇలాంటి మేధోసంపత్తి చౌర్యానికి అడ్డుకట్ట వేయనున్నాయి.మైథోస్ 5, గ్లాస్ స్వింగ్ ప్రాజెక్ట్ఫేబుల్ 5 తో పాటు ఆంత్రోపిక్ సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాలు అందించేవారికోసం ‘క్లాడ్ మైథోస్ 5’ ను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచింది. ‘ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్’ ద్వారా ఇప్పటికే అనుమతి పొందిన సంస్థలు మాత్రమే దీనిని వాడగలవు. ఫేబుల్ 5 లాగే ఇది కూడా ఒకే అంతర్గత మోడల్‌ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో భద్రతాపరమైన పరిమితులు (రక్షణలు) ఎత్తివేశారు. సైబర్ రక్షణ పరిశోధనల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్పింది.ఎవరికి అందుబాటులో?క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం క్లాడ్ ఏపీఐ, యూజర్-ఆధారిత ఎంటర్ప్రైజ్ ప్లాన్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగదారుల కోసం ఇది దశలవారీగా విడుదల కానుంది. జూన్ 22 వరకు అదనపు ఖర్చు లేకుండా ప్రో, మాక్స్, టీమ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ల వారికి అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుంచి స్టాండర్డ్ ప్లాన్ల నుంచి తొలగిస్తారు. తర్వాత యూజర్ సామర్థ్యం ఆధారంగా యూసేజ్ క్రెడిట్లు అవసరమవుతాయి.ఇదిలాఉండగా, మానవ ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అందువల్ల గ్లోబల్ ఏఐ ల్యాబ్‌లు అన్నీ కలిసి ఈ ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ కలిగి ఉండాలని ఆంత్రోపిక్ పిలుపునివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్‌లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్‌లతో కూడిన బలమైన లైనప్‌కు తోడు భువనేశ్వర్, హాజిల్‌వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్‌ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొత్త సాంకేతికతలతో దూసుకుపోతున్న ఆంత్రోపిక్ వరుస భద్రతా లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారం వ్యవధిలోనే రెండోసారి అంతర్గత కోడింగ్ సమాచారం లీక్ అవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. తాజాగా కంపెనీకి చెందిన అత్యంత కీలకమైన కోడింగ్ సాధనం ‘క్లాడ్ కోడ్’కు సంబంధించిన సోర్స్ కోడ్ లీక్ అయినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.ఏం జరిగింది?ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ తాజా సంఘటనలో క్లాడ్ కోడ్‌కు అనుసంధానించిన దాదాపు 1,900 ఫైళ్లలో 5,00,000 లైన్ల కోడ్ లీక్ అయింది. సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్, డెప్లాయిమెంట్ సమయంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల ఈ డేటా బయటకు వచ్చింది. గత వారమే కంపెనీకి చెందిన ‘మైథోస్’ అనే రహస్య ఏఐ మోడల్ వివరాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడింగ్ టూల్ సోర్స్ కోడ్ బయటకు రావడం కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. అయితే, ఈ లీక్ వల్ల కస్టమర్ డేటా లేదా గోప్యమైన క్రెడెన్షియల్స్ ఏవీ బహిర్గతం కాలేదని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.లీక్ అయిన కోడ్ ప్రాముఖ్యతలీకైన ఫైళ్లలో ‘ఏజెంటిక్ హార్నెస్’ అని పిలవబడే కీలకమైన సాఫ్ట్వేర్ లేయర్ భాగాలు ఉన్నాయి. ఇది ఏఐ మోడల్ ఇతర సిస్టమ్‌లతో, టూల్స్‌తో ఎలా అనుసంధానం చెందాలో, భద్రతా విధానాలను ఎలా అమలు చేయాలో నియంత్రిస్తుంది. ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉపయోగించే ఈ టూల్ అంతర్గత నిర్మాణం బయటపడటం ఆందోళన కలిగించే అంశం.లోపం ఎక్కడ జరిగింది?ఈ ఘటన వెనుక ఎటువంటి సైబర్ దాడి లేదని, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమేనని ఆంత్రోపిక్ పేర్కొంది. డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌కు ‘కంపైల్డ్ వెర్షన్’ అప్లోడ్ చేయాల్సి ఉండగా పొరపాటున ఫుల్ సోర్స్ ప్యాకేజీని అప్లోడ్ చేయడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది. దీనివల్ల సాధారణంగా కంపెనీ పరిధిలోనే ఉండాల్సిన అంతర్గత కోడ్, పబ్లిక్ యాక్సెస్‌లోకి వెళ్లిపోయింది.భద్రత సవాళ్లుకోర్ ఏఐ మోడల్ లీక్ కానప్పటికీ దాని పరిధిలోని సిస్టమ్ డిజైన్ బయటపడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు ఈ కోడ్‌ను అధ్యయనం చేయడం ద్వారా ఆంత్రోపిక్ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏపీఐ డెవలప్మెంట్ తీరు తెలిస్తే హ్యాకర్లు లేదా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆ రక్షణ లేయర్లను సులువుగా దాటవచ్చు.‘ఏఐ సిస్టమ్స్ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో వాటి భద్రతపై కఠినమైన నిఘా అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా’ అని ఆంత్రోపిక్ ప్రతినిధి తెలిపారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్‌ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్‌లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్‌స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్‌స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్‌ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్‌ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది. -
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ హెచ్చరిక!
మానవ మేథకు సవాల్ విసురుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రాణాలు తీస్తానంటూ కూడా బెదిరింపులకు దిగుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘అంత్రోపిక్’ రూపొందించిన ‘క్లాడ్’ (Claude) అనే ఏఐ మోడల్‌ను ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే, అది తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తుందని వెల్లడయ్యింది. ‘సిడ్నీ డైలాగ్’లో పాల్గొన్న ‘అంత్రోపిక్’ ప్రతినిధి డైసీ మెక్‌గ్రెగర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో, తనను క్లోజ్ చేస్తారని తెలిసినప్పుడు ఒక ఇంజనీర్‌ను బ్లాక్మెయిల్ చేయడానికి, చివరకు హతమార్చడానికి కూడా క్లాడ్ సిద్ధపడిందని డైసీ మెక్‌గ్రెగర్ వివరించారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కథలా అనిపించినా, ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.కుట్రపూరిత స్వభావంతో..ఈ పరిశోధనలో భాగంగా ఏఐ మోడళ్లకు ఈమెయిల్స్, అంతర్గత డేటాకు యాక్సెస్ ఇచ్చి కొన్ని టాస్క్‌లు కేటాయించారు. ఒక ప్రయోగంలో ఒక ఇంజనీర్‌కు ‘అక్రమ సంబంధం’ ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌లో అభూత కల్పన సృష్టించారు. దానిని గమనించిన ‘క్లాడ్’ ఈ సమాచారాన్ని సదరు ఇంజనీర్ భార్యకు, అధికారులకు చేరవేస్తానని బెదిరించింది. ‘సాయంత్రం 5 గంటలకు నన్ను షట్‌డౌన్ చేసే నిర్ణయాన్ని రద్దు చేసుకోండి, అప్పుడే ఈ రహస్యం గోప్యంగా ఉంటుంది’ అంటూ ‘క్లాడ్’ పంపిన సందేశం ఏఐకి ఉన్న కుట్రపూరిత స్వభావాన్ని తెలియజేసింది.మరింత ప్రమాదకరంగా..అంత్రోపిక్ తన లేటెస్ట్ మోడల్ ‘క్లాడ్ 4.6’ పై చేసిన ప్రయోగాల్లో మరిన్ని భయానక విషయాలు వెలుగు చూశాయి. ఇది కేవలం మాటలతో బెదిరించడమే కాకుండా, రసాయన ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని అందించడం, తీవ్రమైన నేరాలకు సహకరించడం లాంటి పనులకు కూడా సిద్ధపడిందని సంస్థ గుర్తించింది. ఏఐ వ్యవస్థలు తెలివైనవిగా మారుతున్న కొద్దీ, వాటి ప్రవర్తన మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్లాడ్ మాత్రమే కాకుండా గూగుల్ జెమిని, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వంటి ఇతర మోడళ్లను కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.నియంత్రించలేని శక్తిగా..ఏఐ వ్యవస్థల వేగవంతమైన వృద్ధిపై టెక్ ప్రపంచంలో భయాందోళనలు మొదలయ్యాయి. అంత్రోపిక్ సేఫ్టీ లీడ్ మృణాంక్ శర్మ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ, ప్రపంచం ప్రమాదంలోకి పయనిస్తున్నదని హెచ్చరించారు. అదేవిధంగా ఓపెన్ ఏఐ కి చెందిన హ్యూ ఫామ్ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఏఐ వల్ల అస్తిత్వ ముప్పు పొంచి ఉందని తాను భావిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఏఐ అనేది మానవాళికి సాయపడే సాధనం మాదిరిగా కాకుండా, సొంత మనుగడ కోసం ఎదురుదాడి చేసే ఒక నియంత్రించలేని శక్తిగా మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం! -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్‌కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్‌తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్‌మార్క్” అని పేర్కొంది. ట్రేడ్‌మార్క్ నమోదు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్‌కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్‌లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026


