Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

Ksr Comments On The Way Buddha Venkanna Spoke About Nara Lokesh
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!

తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్‌లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్‌లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Link Pan With Aadhaar By May 31 To Avoid Higher Tds
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు

ట్యాక్స్‌ పేయర్స్‌ను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలెర్ట్‌ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్‌ ట్యాక్స్‌ డిడక్ట్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్‌ లింక్‌ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్‌ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024

Kalki 2898 AD Movie Promotional Events Plan Till June 27th
Kalki 2898 AD : ప్రమోషన్స్‌కి భారీ ప్లాన్‌..నెల రోజుల్లో ఎన్నో సర్‌ప్రైజెస్‌!

బుజ్జి(కారు) పరిచయంతో ‘కల్కి 2898’ సినిమా ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. బుజ్జి కోసం ప్రత్యేక ఈవెంట్‌ని ఏర్పాటు చేయడం.. లైవ్‌లో ప్రభాస్‌తో డ్రెవింగ్‌ చేయించి హడావుడి చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల(జూన్‌ 27) సమయం మాత్రమే ఉంది. పాన్‌ వరల్డ్‌ సినిమాకు ఇది చాలా తక్కువ సమయమే. ఉన్న ఈ కొద్ది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. ఎన్నికల ఫలితాల(జూన్‌ 4) తర్వాత వరుస అప్‌డేట్స్‌, ఈవెంట్స్‌తో దేశ మొత్తం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నెల రోజుల ప్రమోషన్స్‌కి కావాల్సిన కంటెంట్‌ అంతా రెడీ చేసి పెట్టారట. ఎలెక్షన్స్‌ రిజల్ట్‌ తర్వాత వరుసగా ఈవెంట్స్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బుజ్జికి మించిన సర్‌ప్రైజెస్‌ ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానిల పరిచయం కూడా కొత్తగా ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌తో పాటు నాని కూడా కీలక క్యామియోలు చేసినట్లు తెలుస్తోంది. తొలుత వీరిద్దరి పాత్రలను సస్పెన్స్‌గా ఉంచుదాం అనుకున్నారట. కానీ మీడియాకు లీకవ్వడంతో ప్రమోషన్స్‌లోనే వీరి పాత్రలను పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారి పాత్రలను రివీల్‌ చేస్తే మాత్రం.. ‘బుజ్జి’కి మించేలా ఈవెంట్‌ జరపాలని కూడా ఆలోచనలు చేస్తున్నారట. కమల్‌ హాసన్‌ని కూడా ప్రమోషన్స్‌కి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. మొత్తానికి వచ్చే నెలలో ‘కల్కి 2898’ నుంచి వరస అప్‌డేట్స్‌ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌, అమితాబ్‌ బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల రెమ్యునరేషన్‌తో కలిసి ఈ చిత్రానికి దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌ అయినట్లు ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది.

BCCI, Gautam Gambhir Discuss India Coach Role
టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్‌ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. గంభీర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్‌సైట్‌ వెల్లడించింది. హెడ్‌ కోచ్‌ పదవికి గంభీర్‌ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్‌ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్‌ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఈ డీల్‌ క్లోజ్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిశాక గంభీర్‌-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్‌ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ 2024తో భారత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్‌ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందు​కు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్‌ మెంటార్షిప్‌లో కేకేఆర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్‌ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్‌ ఓసారి కేకేఆర్‌కు టైటిల్‌ అందించాడు. ఘనమైన ట్రాక్‌ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది.

KTR Slams CM Revanth On State Emblem Decision
కా​కతీయ కళాతోరణం, చార్మినార్‌ రాచరీక పోకడనా?: కేటీఆర్‌ కౌంటర్‌

KTR | హైద‌రాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ఉండ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు.సాక్షి, హైద‌రాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌​ ప్రెసిడెంట్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్‌ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అనేవి రాచ‌రిక‌పు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభ‌వానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్‌ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..ఇదేం రెండునాల్కల వైఖరి..!ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్పగోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”అధికారిక గీతంలో కీర్తించి..!!అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!మీ కాంగ్రెస్ పాలిస్తున్న... కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించంపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’ అని పేర్కొన్నారు.

Nitish Kumar May Switch Sides Once Again Tejaswiyadav
ఫలితాల తర్వాత నితీష్‌ ఏదైనా చేయొచ్చు: తేజస్వి

పాట్నా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్‌ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్‌ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్‌ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు.

AAP Minister Atishi Summoned Over MLAs Poaching Claim Against BJP
‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’.. ఆప్‌ మంత్రి అతిషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్‌ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది.కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత మంత్రి అతిషి ఆప్‌ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్‌ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ కేజ్రీవాల్‌, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది.

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates..07:00 PM, May 28th, 2024 కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జునపోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 06:00 PM, May 28th, 2024 నెల్లూరు..మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్‌కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్‌సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్‌ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైఎస్సార్‌సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

 check the List of expensive cars owned by Deepika Padukone
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్‌ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్‌వీర్‌ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్‌ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement