ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది. | TTD-tirumala temple Darshanam to limited people | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది.

Jul 25 2018 7:10 AM | Updated on Mar 21 2024 7:46 PM

ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది. భక్తుల ఒత్తిడితో మహాసంప్రోక్షణ జరిగే ఆరురోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది. రోజుకు కొన్ని గంటలే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సర్వదర్శనం క్యూలో వచ్చే భక్తులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 11 నుంచి 16 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈనెల 14న పాలకమండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం మరోసారి తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement