వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం | Comfortable srivari darshanam to the older,handicaped people | Sakshi
Sakshi News home page

వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

Jun 1 2017 4:01 AM | Updated on Sep 5 2017 12:28 PM

తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేక టోకెన్‌ కౌంటర్లు ప్రారంభ మయ్యాయి.

ప్రత్యేక టోకెన్‌ కౌంటర్లు ప్రారంభించిన టీటీడీ జేఈవో
 
సాక్షి, తిరుమల: తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేక టోకెన్‌ కౌంటర్లు ప్రారంభ మయ్యాయి. టీటీడీ జేఈవో కేఎస్‌.శ్రీనివాస రాజు బుధవారం ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్ల మంజూరును ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో 1,500 మంది వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నా మన్నారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా టోకెన్‌ కౌంటర్లు ప్రారంభించామన్నారు. మధ్యా హ్నం స్లాట్‌కు కూడా ఉదయమే టోకెన్లు మంజూరు చేస్తామని, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేద న్నారు. దక్షిణ మాడ వీధిలో వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే హాలులో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు సీట్ల సామర్థ్యాన్ని పెంచామని జేఈవో తెలిపారు.
 
రేపు డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో
తిరుమలలో జూన్‌ 2వ తేదీ శుక్రవారం డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు 0877–2263261 నంబరుకు ఫోన్‌చేసి తమ సందేహలు, సూచనలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు తెలియజేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement