తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

విశ్వపతి శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియ వాహనమైన గరుడునిపై ఊరేగుతూ ఆదివారం భక్తకోటికి సాక్షాత్కరించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు అలంకరించారు.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top