
సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి.
ఇక బ్రహ్మోత్సవాల అనుబంధ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభించనున్నారు. ఈసారి ఉత్సవాల్లో కొత్త సర్వభూపాల వాహనం వాడనున్నారు. సెప్టెంబర్ 6న పౌర్ణమి గరుడవాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవ గరుడవాహన సేవగా నిర్వహించి లోటుపాట్లు గుర్తించి, సవరించనున్నారు.