All India Anna Dravida Munnetra Kazhagam Party
-
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
నమ్మక తప్పని నిజం.. అన్నాడీఎంకే నాయకులపై సీఎం స్టాలిన్ గురి!
డీఎంకే, అన్నాడీఎంకే.. ఈ రెండు పార్టీల చరిత్రే.. మొత్తం తమిళనాడు రాజకీయ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. సిద్ధాంత పరంగానే కాదు.. భావజాలం పరంగానూ విభేదించుకునే ఈ పార్టీలకు చెందిన నాయకులు బద్ధ శత్రువుల కంటే దారుణంగా వ్యవహరిస్తుంటారు. నిప్పుకు చెద పట్టదు అన్నది ఎంత నిజమో.. వీరు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లరు అనేది కూడా అంతే నిజమని భావిస్తుంటారు. ఎందుకంటే అత్యంత అరుదైన పరిస్థితుల్లోనూ వారు తమ సిద్ధాంతాలను వదులుకుని ప్రత్యర్థి పార్టీలో చేరేందుకు ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు కాలం మారింది. అమ్మ మరణంతో దారీతెన్నులేని అన్నాడీఎంకే నుంచి నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి బీజేపీ రెడ్ కార్పెట్ పరిచేందుకు యత్నిస్తోంది. తద్వారా తమిళనాట బలపడాలని పావులు కదుపుతోంది. దీంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న స్టాలిన్ అన్యమనస్కంగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు పచ్చజెండా ఊపేశారు. దీంతో ఈ అరుదైన పరిస్థితి ఒకవిధంగా.. ‘‘నమ్మక తప్పని నిజం’’.. అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలను గురి పెట్టి తమ పార్టీలోకి ఆహ్వానించాలని అధికార డీఎంకే భావిస్తోంది. అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ వైపుగా చూడకుండా ఉండేందుకే స్టాలిన్ ప్రస్తుతం కొంత.. రాజీ ఫార్ములాను అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. అన్నాడీఎంకే జిల్లా స్థాయి నేతలను డీఎంకేలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు సాధారణంగా ఇష్టపడారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేర్చుకోవాల్సి వస్తే.. సవాలక్ష కట్టుబాట్లు ఉండేవి. పారీ్టలోకి వచ్చినా.. వారికి తగిన ప్రాధాన్యం కూడా ఉండేది కాదు. దీంతో ఒక పార్టీలోకి వారు మరోపార్టీలోకి వచ్చేవారు కాదు. చదవండి: ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధం సీనియారిటీ, సామాజిక, ఆర్థిక బలం కలిగిన కొన్ని వర్గాలకు మాత్రం మినహాయింపు ఉండేది. ఇలా.. జయలలిత మరణం తర్వాత ఒకరిద్దరు అన్నాడీఎంకే ముఖ్య నాయకులు డీఎంకే గూటికి వచ్చారు. తర్వాత పరిస్థితి యథా ప్రకారం ఉప్పు..నిప్పులాగా ఉండేది. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే అసంతృప్తి నేతలను తమ వైపునకు తిప్పుకోవాల్సిన అవసరం డీఎంకేకు ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం డీఎంకే సీనియర్లు కొన్ని కీలక జిల్లాలోని అన్నాడీఎంకే నేతలపై గురిపెట్టి అక్కున చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కోవై సెల్వరాజ్(ఫెల్) బీజేపీ వైపు వెళ్లకుండా.. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య నెలకొన్న విభేదాలతో అనేక మంది అసంతృప్తి నేతలు పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. అయితే డీఎంకే నుంచి వీరికి పిలుపు రాకపోవడంతో బీజేపీలో చేరుతున్నారు. ఫలితంగా బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతోంది. ఇది డీఎంకేకు గట్టి దెబ్బగా మారుతోంది. దీంతో అన్నాడీఎంకే నుంచి వచ్చే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు డీఎంకే సిద్ధమైంది. ప్రధానంగా కొంగు మండలంగా భావించే కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్, నామక్కల్, నీలగిరి తదితర జిల్లాలు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు డీఎంకే సిద్ధమైంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ పనిని.. ఆయా జిల్లాలోని డీఎంకే సీనియర్లకు అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి.. అక్కడ అన్నాడీఎంకే నాయకులకు వల వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోవై సెల్వరాజ్‌ను డీఎంకేలోకి ఆహ్వనించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాకతో కోయంబత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న అన్నాడీఎంకే నేతలు డీఎంకే వైపుగా క్యూ కట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే ఊపుతో పెద్దఎత్తున అన్నాడీఎంకే నాయకులను డీఎంకేలోకి ఆహా్వనించే దిశగా ఆ పార్టీ సీనియర్లు స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కార్యకర్తలకు పెట్రోల్ టోకన్లు
తమిళనాడు , టీ.నగర్: ఎన్నికల ప్రచారం కోసం బైకులో వచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలకు పెట్రోల్ టోకన్లు అందజేస్తుండడంతో ఎన్నికల్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి ఆసై మణి, సీర్గాళి ఆబత్తుకాత్త వినాయకర్ ఆలయం నుంచి ఆదివారం నిర్వాహకులు, కార్యకర్తలతో ప్రచారాన్ని ప్రారంభించారు. బైకులో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు 250 మందికి తలా ఒక లీటర్ పెట్రోల్ వేసుకునేందుకు టోకన్లు అందజేశారు. ఈ టోకన్లను తీసుకుని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో కార్యకర్తల బైకులకు పెట్రోల్ నింపుకుంటూ వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న సీర్గాళి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి స్వామినాథన్, పోలీసులు పెట్రోల్ బంకుకు వెళ్లి 200 టోకన్లను రూ. 10,870 నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బంకు యజమాని వద్ద విచారణ జరుపుతున్నారు. -
శశికళకే పూర్తి హక్కులు: దినకరన్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వం మైనార్టీలో ఉందంటూ హస్తినకు తమిళ రాజకీయాలను మోసుకెళ్లగా, దినకరన్ కూడా బల నిరూపణ అంశంను తెరపైకి తీసుకొచ్చి పళనిని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు దినకరన్ శిబిరంలోకి చేరిపోగా, పళని-పన్నీర్ గ్రూపులో స్లీపర్ సెల్స్ ఉన్నారని, వలసలు కొనసాగుతాయంటూ రిసార్ట్ లో సేదతీరుతున్న దినకరన్ వర్గ నేతలు హింట్ కూడా ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు శశికళకే ఉంటుందని దినకరన్ చెప్పుకొచ్చారు. శశికళ బహిష్కరణ నేపథ్యంలో కొత్త జనరల్ సెక్రటరీని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 12న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే మీటింగ్ నిర్వహించే హక్కు ప్రధాన కార్యదర్శిగా శశికళకు తప్ప ఎవరికీ ఉండదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సమావేశానికి ఎవరూ హాజరుకావొద్దంటూ పార్టీ సభ్యులకు దినకరన్ సూచించారు. కాగా, సోమవారం సీఎం పళనిస్వామి నేతృత్వంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళ, దినకరన్‌లను బహిష్కరించటం, వారి నిర్ణయాలు చెల్లవంటూ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యేలు: శశికళ మరియు దినకరన్ వర్గాల ఎమ్మెల్యేలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి తాము ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సెప్టెంబర్ 5లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ధన్పాల్ మరో దఫా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఇక బలనిరూపణకు గవర్నర్ ను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.


