అన్నాడీఎంకే కార్యకర్తలకు పెట్రోల్‌ టోకన్లు

AIADMK Leaders Distributing Petrol Tokens in Tamil nadu - Sakshi

తమిళనాడు , టీ.నగర్‌: ఎన్నికల ప్రచారం కోసం బైకులో వచ్చిన అన్నాడీఎంకే కార్యకర్తలకు పెట్రోల్‌ టోకన్లు అందజేస్తుండడంతో ఎన్నికల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి ఆసై మణి, సీర్గాళి ఆబత్తుకాత్త వినాయకర్‌ ఆలయం నుంచి ఆదివారం నిర్వాహకులు, కార్యకర్తలతో ప్రచారాన్ని ప్రారంభించారు. బైకులో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు 250 మందికి తలా ఒక లీటర్‌ పెట్రోల్‌ వేసుకునేందుకు టోకన్లు అందజేశారు. ఈ టోకన్లను తీసుకుని కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకులో కార్యకర్తల బైకులకు పెట్రోల్‌ నింపుకుంటూ వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న సీర్గాళి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి స్వామినాథన్, పోలీసులు పెట్రోల్‌ బంకుకు వెళ్లి 200 టోకన్లను రూ. 10,870 నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బంకు యజమాని వద్ద విచారణ జరుపుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top