
తగ్గేదేలేదన్న నితీశ్ కుమార్.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్

బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా నయా సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు

ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్.. టెస్ట్‌ల్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న నితీశ్.. తగ్గేదేలేదంటూ పుష్ప స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.










