అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది.
							పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు
							200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది
							ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు
							ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు
							కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
