టీమిండియా స్టార్ క్రికెటర్ అక్షర్ పటేల్ తండ్రి కాబోతున్నాడు
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు
తన భార్య మేహా పటేల్ సీమంతాన్ని ఘనంగా నిర్వహించాడు
ఇందుకు సంబంధించిన అందమైన వీడియో, ఫొటోలను ఇన్‌స్టాలో అక్షర్ షేర్ చేశాడు
గతేడాది జనవరిలో డెంటిస్ట్ మేహాతో అక్షర్ వివాహం వడోదరలో జరిగింది
ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు
కానీ.. తుదిజట్టులో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు చోటు దక్కలేదు


