తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది.
భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్‌లోనూ కుంభవృష్టి కురిసింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి.
భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
శ్రీశైలంలోనూ నాన్ స్టాప్‌గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


