
గడిచిన ఏడాది తనకెంతో కష్టంగా గడిచిందంటోంది హీరోయిన్ షాన్ రోమీ.

నా ఆటో ఇమ్యూన్ (రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మీ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది) పరిస్థితి చేయిదాటిపోయింది.

సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ఫ్రెండ్‌ను కలిశాను.

ఆమె తన మాటలతో నాలో ధైర్యం నింపింది.

పోయిన జుట్టు మళ్లీ వచ్చేస్తుంది బాధపడకంటూ ఓదార్చింది.

గతేడాది ఆగస్టు నుంచి ప్రతి రెండు నెలలకొకసారి స్టెరాయిడ్ తీసుకుంటున్నాను.

శారీరక వ్యాయామం చేయాలన్నా భయమేస్తోంది.

ఎందుకంటే నా శరీరం కొంచెం ఎక్కువ కష్టపడితే చాలు వెంటనే నెలసరి వచ్చేస్తోంది.

ముందు నేను ప్రశాంతంగా ఉండాలనుకుని గోవాకు వెళ్లిపోయాను.

అప్పటినుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.

షాన్ రోమీ.. లూసిఫర్, హృదయం, బ్లూ స్కైస్ -గ్రీన్ వాటర్స్ -రెడ్ ఎర్త్ సినిమాలు చేసింది.

కమ్మటి పాదం మూవీలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించింది.












