

కూతురి కోసం ఈ మూవీలో కీలక పాత్రలో నటించాడు రజనీ. అయినా ఈ మూవీని గట్టెక్కించలేకపోయాడు.

ఇదిలా ఉంటే ఐశ్వర్య రెండు రోజుల క్రితం కొత్తింటిని కొనుగోలు చేసింది.

ఈ గృహ ప్రవేశ వేడుకకు ఆమె తల్లిదండ్రులు లతా, రజనీకాంత్, సోదరి సౌందర్య హాజరయ్యారు.

కూతురి అపార్ట్‌మెంట్, ఇంటీరియర్ డిజైన్ చూసి వారంతా మంత్రముగ్ధులయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇకపోతే హీరో ధనుష్‌తో రెండేళ్ల క్రితమే విడిపోయిన ఐశ్వర్య త్వరలో ఇదే ఇంట్లో తన పిల్లలతో కలిసుండనుంది.










