తెలుగులో బోలెడంత మంది దర్శకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్
అలా మాస్ సినిమాలతో తనదైన ట్రెండ్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్
సుమో గాల్లోకి లేచే సీన్ వచ్చిందంటే అది వినాయక్ సినిమా అని ఫిక్సయిపోవచ్చు
2002లో 'ఆది' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు
చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ, లక్ష్మీ, కృష్ణ, అదుర్స్ ఇలా సూపర్ హిట్ సినిమాలు తీశారు
చిరంజీవి రాజకీయాల్లకి రాకముందు 'ఠాగుర్' అనే హిట్ ఇచ్చాడు
చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నం.150' మరో హిట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వినాయక్.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు
గతేడాది 'ఛత్రపతి' రీమేక్ చేసిన వినాయక్.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు
మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా వినాయక్‌ని బాగా ఇబ్బంది పెట్టాయి
మధ్యలో హీరోగా 'సీనయ్య' అనే సినిమా మొదలుపెట్టారు. కానీ మధ్యలోనే అది ఆగిపోయింది
ప్రస్తుతానికైతే సినిమాలేం చేయకుండా పూర్తిగా రెస్ట్ మోడ్‌కే పరిమితమయ్యారు


