హైదరాబాద్ : నగరవాసులకు పల్లె పరిమళాలు, సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలు, స్థానిక రుచులను చేరువ చేసే ‘సరస్ మేళా’ ప్రదర్శన బుధవారం ఐమాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో పారంభమైంది.
పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత చీరలు, కలంకారీ కళాకృతులు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, బంజారా హస్తకళలు కొలువుదీరాయి. చెక్క బొమ్మలు, జ్యూట్, లెదర్ బ్యాగులు, అలంకరణ వస్తువులు, సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి.
మొత్తం 204 ఉత్పత్తుల స్టాళ్లు నమోదవగా..ఇందులో తెలంగాణ నుంచి 95, ఇతర రాష్ట్రాల నుంచి మిగతావి ఉన్నాయి.
చేర్యాల బొమ్మలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయి. మట్టి కుండలు, కడాయిలు, జగ్గులు, వాటర్ బాటిళ్లు, జ్యూట్ వస్తువులు, లభిస్తున్నాయి.ఈ నెల 18 వరకు ప్రదర్శన కొనసాగనుంది.


