డిజైనర్ రాహుల్ మిశ్రా కోసం కియారా అద్వానీ, కరణ్ జోహార్ ఒకే రకమైన నలుపు రంగు దుస్తులలో ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
కియారా అద్వానీ రాహుల్ మిశ్రా కలెక్షన్ నుంచి ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ గౌన్‌ను ధరించారు. దీన్ని లక్ష్మీ లెర్, కశిష్ గౌర్ డిజైన్ చేశారు
ఆమె తన లుక్‌ను డైమండ్ చెవిపోగులు, కాక్‌టెయిల్ రింగులు, బ్రాస్‌లెట్‌లతో పూర్తి చేసింది
ఇక కరణ్ జోహార్ నల్లని సూట్‌లో కియరా లుక్‌కు చక్కగా సరిపోయేలా కనిపించారు. అలల వంటి డిజైన్ కలిగిన సీక్విన్డ్ బ్లేజర్, దానికి అనుగుణంగా ప్రత్యేకమైన ఆకృతిని కలిగిన కాలర్లతో కూడిన నల్లని షర్ట్. అందుకు జతగా బ్లాక్ కలర్ ప్యాంట్‌ను ఆయన ధరించారు.
వజ్రాల చోకర్, నల్లని బూట్లు, వింటేజ్-స్టైల్ సన్‌గ్లాసెస్‌తో ఆయన తన రూపాన్ని పూర్తి చేసుకున్నారు.


