విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు మన విశాఖ నగరానికి వచ్చేసింది. బీచ్ రోడ్డులోని టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలోనే ఇమ్మర్సివ్ మ్యూజియం(ఆర్ట్ మ్యూజియం) రూపుదిద్దుకుంటోంది. ఇది పర్యాట కులకు, సరికొత్త అనుభూతిని తీసుకురానుంది.


