
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీమహాలక్ష్మి అలంకరణలో గజ వాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.

ఉదయం జగన్మోహిణి అలంకరణలో పల్లకీలో ఊరేగుతూ దర్శనమిచ్చారు.

కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు





















