విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బుధవారం సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం వేళ ఓనమాలు దిద్దే చిన్నారులకు తొలుత అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తు ఈ కార్యక్రమానికి వేదికైంది.
వేద పండితులు ఓం కారంతో మొదటి అక్షరాన్ని దిద్దించి చిన్నారుల విద్యా జీవితానికి బాటలు వేశారు. దాదాపు 250 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


