వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో రైతు సమస్యలపై బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది.
సాక్షి, కడప: వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో రైతు సమస్యలపై బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్ గూడూరు రవి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.