తాడిపత్రిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం | grand welcome to ys jagan mohan reddy in tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం

Jun 2 2016 11:20 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీసీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

వైఎస్సార్‌సీసీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం పెద్ద ఒడుగూరు మండలం పెద్దమేడిమాకులపల్లి నుంచి ఆయన రోడ్డు షో ప్రారంభమైంది. లక్ష్మింపల్లిలో ప్రజలు తమ అభిమాన నేత జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ వారికి అభివాదం చేశారు.

అనంతరం జగన్ కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి యాడికి మండలం నగురూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement