మిల్లీ మీటర్‌ దూరంలో బతికిపోయాడు

Boys skull pierced with screw in treehouse-building accident - Sakshi

మేరీలాండ్‌ : ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆరు ఇంచుల మేకు పుర్రెలోకి దిగిన ప్రమాదంలో మిల్లీ మీటర్‌ దూరంలో బతికిపోయాడు ఓ 13 ఏళ్ల  బాలుడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన డారియస్‌ ఫోర్‌మెన్‌ చెట్టుపై ఇళ్లు నిర్మించుకుంటుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. అయితే కింద ఉన్న ఆరు ఇంచుల కప్‌ బోర్డు మేకు బలంగా అతని తలలోకి దిగింది.

వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా కప్‌బోర్డు 5 ఫీట్లు ఉండటంతో అతన్ని అందులోకెక్కించేందుకు కష్టమైంది. దీంతో 5 ఇంచుల కప్‌ బోర్డును రెండు ఇంచులుగా కట్‌ చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా మేకు అతని పుర్రేలోకి దిగింది. వెంటనే డాక్టర్లు బయటకు ఉన్న మేకును తొలిగించి అనంతరం శస్త్ర చికిత్స ద్వారా లోపలి మేకును తొలిగించారు.

ఇది చాలా సున్నితమైన ఆపరేషన్‌ అని, బాలుడు అదృష్టవంతుడని, మిల్లీమీటర్‌ దూరంలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. గత శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా డాక్టర్లు ఆదివారం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక గురువారం తన పుట్టిన రోజునాడే డిశ్చార్జ్‌ కావడం తమ కుమారుడికి పున:జన్మ అని తల్లితండ్రులు తెలిపారు. అంతేగాకుండా 5 ఇంచుల కప్‌ బోర్డును 7 గంటల సేపు మోసాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంతో చెట్లపై ఇళ్లు నిర్మించరాదనే గుణపాఠం నేర్చుకున్నాని ఆ బాలుడు పేర్కొన్నాడు.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top