రాజుగారి కోడి పలావు | Ulavacharu Biriyani very famous in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజుగారి కోడి పలావు

Jul 10 2014 4:05 AM | Updated on Sep 2 2017 10:03 AM

రాజుగారి కోడి పలావు

రాజుగారి కోడి పలావు

ఆ టేస్టే వేరు: ‘రాజుగారి కోడి పలావు కేరాఫ్ ఉలవచారు’... ఇదేమీ సినిమా టైటిల్ కాదు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-68లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్‌లో ఫేమస్ డిష్.

ఆ టేస్టే వేరు: ‘రాజుగారి కోడి పలావు కేరాఫ్ ఉలవచారు’... ఇదేమీ సినిమా టైటిల్ కాదు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-68లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్‌లో ఫేమస్ డిష్. హైదరాబాద్ బిర్యానీకి దీటుగా కొత్తగా తెరపైకి వచ్చిన రాజుగారి కోడి పలావు భోజనప్రియులకు చవులూరిస్తోంది. దీనిని పద్ధతిగా అరిటాకులో వడ్డించడం మరో ప్రత్యేకత..
 
 సెలబ్రిటీల ఫేవరెట్...
 రాజుగారి కోడి పలావుకు పలువురు సెలబ్రిటీలు అభిమానులుగా మారారు. మణిరత్నం, లక్ష్మి మంచు, సమంతా, కోన వెంకట్, వెన్నెల కిశోర్, రానా, వీవీ వినాయక్ వంటి సినీ ప్రముఖులంతా రాజుగారి కోడి పలావు కోసమే ‘ఉలవచారు’ రెస్టారెంట్‌కు వస్తుంటారు. ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేయడానికి సిటీలో ఇది బెస్ట్ హ్యాంగౌట్ ప్లేస్ అని ఇక్కడకు వచ్చిన హీరో ఆది చెప్పారు. తాను ఇక్కడకు ఎప్పుడు వచ్చినా, స్టార్టర్‌గా బంగ్లా చికెన్ ఆర్డర్ చేస్తానని, బంగ్లా చికెన్‌తో మొదలయ్యే భోజనం, రాజుగారి కోడి పలావుతో ముగుస్తుందని అన్నారు.
 
 అంతా స్టీమ్‌తోనే...

 ‘ఇది పూర్తిగా స్టీమ్‌బేస్డ్ బిర్యానీ. చికెన్ తప్ప ఇందులో నూనెలేవీ వాడం. కాస్త నెయ్యి, కొద్దిగా మసాలా వాడతాం. ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి తప్ప మరేమీ వాడం’ అని ‘ఉలవచారు’ ఎండీ ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో కూడిన రాజుగారి కోడి పలావును ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే తయారు చేస్తామని ఆయన తెలిపారు. దీనికి కాంబినేషన్‌గా గోంగూర గ్రేవీ, స్పైసీ చట్నీ, రైతా వడ్డిస్తామని, వాటితో పాటు కాంప్లిమెంటరీగా దద్దోజనం, చిప్స్ అందిస్తామని చెప్పారు.
 - సాక్షి, సిటీప్లస్

Advertisement
 
Advertisement
Advertisement