'ఆమ్ ఆద్మీకి మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు' | Congress undecided on alliance with Aam Aadmi Party: Sheila Dikshit | Sakshi
Sakshi News home page

'ఆమ్ ఆద్మీకి మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు'

Dec 9 2013 5:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఆమ్ ఆద్మీకి మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు' - Sakshi

'ఆమ్ ఆద్మీకి మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు'

ఆమ్ ఆద్మీ పార్టీతో సర్దుబాటు కుదుర్చుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయమేమి తీసుకోలేదు అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయమేమి తీసుకోలేదు అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు అవసరం లేదు అని.. వారు ఎవ్వరిని మద్దతు కోరడం లేదు అని షీలా వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఎదురైన దారుణ ఓటమి కారణాలేంటనే విషయంపై తాము ఇంకా అధ్యయనం చేయలేదు అని ఆమె అన్నారు. ఢిల్లీలో తాము అందించిన సుపరిపాలనతో తాము ధైర్యంగా, నమ్మకంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement