నాలుగో రోజు ముగిసిన జగన్ రైతు భరోసా యాత్ర | ys jagan mohan reddy 4th day raithu bharosa yatra in anatapur district | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు ముగిసిన జగన్ రైతు భరోసా యాత్ర

Jul 24 2015 8:14 PM | Updated on Jul 25 2018 4:09 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో రోజు రైతు భరోసా యాత్ర ముగిసింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో రోజు రైతు భరోసా యాత్ర ముగిసింది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటించారు. ఆత్మహత్యకు పాల్పడిన పలు రైతు కుటుంబాలను పరామర్శించారు.

వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గౌనిమేకలపల్లి చేరుకుని రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను ఓదార్చారు. కొత్తపల్లికి చేరుకుని రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.

రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. రైతు భరోసా యాత్రంలో భాగంగా ఐదో రోజు శనివారం వైఎస్ జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రేపు పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement