నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు | ys jagan congratulates nitish kumar, laluprasad yadav | Sakshi
Sakshi News home page

నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు

Nov 8 2015 6:34 PM | Updated on Jul 18 2019 2:11 PM

నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

నితీశ్‌, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు.

హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్‌లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు  అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు.
   
 

Advertisement
 
Advertisement
Advertisement