కదులుతున్న రైల్లో మహిళపై దారుణం | Young woman raped in train in Assam, one nabbed | Sakshi
Sakshi News home page

కదులుతున్న రైల్లో మహిళపై దారుణం

Sep 23 2016 5:03 PM | Updated on Sep 4 2017 2:40 PM

కదులుతున్న రైల్లో మహిళపై దారుణం

కదులుతున్న రైల్లో మహిళపై దారుణం

బెంగళూరు-టిన్సుకియా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో​ ఓ యువకుడు అసోం యువతిపై లైంగికదాడికి పాల‍్పడ్డాడు.

గువహటి: బెంగళూరు-టిన్సుకియా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో​ ఓ యువకుడు అసోం యువతిపై లైంగికదాడికి పాల‍్పడ్డాడు. టిన్సుకియా జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేయగా, అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

బెంగళూరులో పనిమనిషిగా పనిచేస్తున్న బాధితురాలు (20) దుర్గా పూజ కోసం సొంతూరు అసోంలోని టిన్సుకియా వెళ్లేందుకు రైల్లో బయల్దేరింది. ఆమెతో పాటు అదే కంపార్టుమెంట్‌లో ప్రయాణిస్తున్న చాలామంది ప్రయాణికులు డిబ్రుగఢ్‌ స్టేషన్‌లో దిగిపోయారు. గురువారం రాత్రి ఆ కంపార్టుమెంట్‌లో ఉన్న ముగ్గురు యువకులు.. ఆ యువతిని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లగా, వీరిలో ఒకడు దారుణానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం రైలు టిన్సుకియా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత తనను తీసుకెళ్లేందుకు వచ్చిన సోదరుడికి బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. అతను రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రహ్లాద్‌ ఛెత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడలేదని, నిందితుడికి సహకరించారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement