హస్తంతో దోస్తి చీపురికి చేటు | Yoga guru baba Ramdev to do door to door publicity for Narendra Modi | Sakshi
Sakshi News home page

హస్తంతో దోస్తి చీపురికి చేటు

Published Sat, Jan 4 2014 1:50 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

హస్తంతో దోస్తి చీపురికి చేటు - Sakshi

హస్తంతో దోస్తి చీపురికి చేటు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం చారిత్రక తప్పిదమని యోగా గురువు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం చారిత్రక తప్పిదమని యోగా గురువు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. హస్తంతో దోస్తి చేస్తే చీపురికే చేటు అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం న్యూఢిల్లీలో రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం షీలా దీక్షిత్పై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, అయితే న్యూఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పాలనా పగ్గాలు చేపట్టాక ఆమెపై విచారణ ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.

 

సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీలో ఉండి... మోడీ వినాశకారి అని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొనడం విడ్డూరమని రాందేవ్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి అంశాలవారిగా మద్దతు ఇస్తున్నట్లు బాబా రాందేవ్ పేర్కొన్నారు. మోడీకి తమ మద్దతుపై రేపు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మోడీ నాయకత్వంపై దేశవ్యాప్తంగా మద్దతు కూడాగట్టేందుకు చర్యలు చేపడతామన్నారు.

 

ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో నిన్న విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విలేకర్ల అడిగిన పలు ప్రశ్నలకు మన్మోహన్ సమాధానాలు ఇచ్చారు. మోడీ ప్రధాని అయితే భారతదేశానికి వినాశనమే అని ప్రధాని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీంతో అటు బీజేపీ, ఇటు పలు పార్టీలు ప్రధాని వ్యాఖ్యాలపై ఘాటుగా స్పందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement