ప్రముఖ డైరెక్టర్‌ ఇంట్లో అనుమానాస్పద మృతి | worker suspicious death in kodandarami reddy house | Sakshi
Sakshi News home page

ప్రముఖ డైరెక్టర్‌ ఇంట్లో అనుమానాస్పద మృతి

May 7 2017 1:31 PM | Updated on Sep 5 2017 10:38 AM

ప్రముఖ డైరెక్టర్‌ ఇంట్లో అనుమానాస్పద మృతి

ప్రముఖ డైరెక్టర్‌ ఇంట్లో అనుమానాస్పద మృతి

టాలీవుడ్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన జయశ్రీ(19) కోదండరామిరెడ్డి ఇంట్లో ఏడాదిగా పనిచేస్తోంది. అక్కడే ఇంటి ఆవరణలోని ఓ గదిలో నివాసముంటున్న జయశ్రీ ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయింది.

జయశ్రీ మరణంపై ఇంట్లోని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement