అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని హోసూరులో ఉన్న టైటాన్ వాచెస్ కంపెనీ మహిళా ఉద్యోగులు గిన్నిస్ రికార్డుల పంట పండించారు.
సిప్‌కాట్ (తమిళనాడు), న్యూస్‌లైన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని హోసూరులో ఉన్న టైటాన్ వాచెస్ కంపెనీ మహిళా ఉద్యోగులు గిన్నిస్ రికార్డుల పంట పండించారు. 12 విభాగాల్లో కొత్త రికార్డులను సృష్టించారు. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు ఒకేచోట చేరి బెలూన్లలో గాలి నింపడం, 382 మంది మహిళలు ఒకే చోట చేరి మదర్ థెరిస్సా రూపుతో ఉన్న మాస్కులను ధరించడం, అందరూ ఒకే సారి ఈల వేయడం, పేపర్ టీ కప్పులు నుదుటిపై పెట్టుకోవడం, ఒకే వ్యక్తికి ఏకకాలంలో ఎంతో మంది ఉత్తరాలు రాయడం వంటి అంశాల్లో రికార్డులను నమోదు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు శాంటిగర్‌యాంగ్, ఫ్రాన్సిస్ విలియమ్ వీటిని పర్యవేక్షించారు.