భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్

భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్


ఐజాల్: అత్యాచారాల సంసృతి ఈశాన్య రాష్ట్రాలకు పాకుతోంది. మిజోరంలో వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఎదుటే వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. రొపాయబవాక్ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణోదంతం జరిగిందని పోలీసులు తెలిపారు.



బాధితురాలి భర్తను చెట్టుకు కట్టేసి, అతడి ఎదుటే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చావల్హ్మున్ ప్రాంతానికి చెందిన జార్జొలియనా(19), పీసీ లాల్హూట్లుయాంగ(20) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top