శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో మరో ‘డ్రా’ | Another draw in Srinidhi Deccan FCs account | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో మరో ‘డ్రా’

Apr 6 2026 3:43 AM | Updated on Apr 6 2026 3:43 AM

Another draw in Srinidhi Deccan FCs account

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌)లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ఐజ్వాల్‌ ఎఫ్‌సీ జట్టుతో సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. 29వ నిమిషంలో కెపె్టన్‌ డేవిడ్‌ కాస్టనెడా మునోజ్‌ చేసిన గోల్‌తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 87వ నిమిషంలో శ్రీనిధి జట్టు డిఫెండర్‌ జగ్‌దీప్‌ సింగ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయడంతో ఐజ్వాల్‌ జట్టు స్కోరును సమం చేసింది. 

మొత్తం పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 12న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి డెక్కన్‌ జట్టు పోటీపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement