ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ | Ishan Kishan Reveals Reasons Behind Sunrisers Hyderabad Defeat Against Lucknow Super Giants, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Apr 5 2026 9:55 PM | Updated on Apr 6 2026 4:41 PM

Ishan Kishan blames early wicket collapse for SRHs loss against LSG

ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు రెండో ఓట‌మి ఎదురైంది. ఆదివారం హైద‌రాబాద్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది.  ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ప‌రంగా విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది.

ఈ స్కోర్ కూడా క్లాసెన్‌(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) రాణించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ సాధించ‌గ‌ల్గింది. ఆ త‌ర్వాత 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బౌల‌ర్లు డిఫెండ్ చేయ‌లేక‌పోయారు. ఈ  ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని కిషన్ తెలిపాడు.

"ఇది చాలా క్లోజ్‌ గేమ్. నిజానికి ప్రత్యర్ధి ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయాము. కానీ మా బౌలర్లు ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చారు. ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించాము. అయితే ఇలాంటి లోస్కోరింగ్ గేమ్స్‌లో కటి లేదా రెండు బౌండరీలు ఫలితాన్ని మార్చేస్తాయి. 

అయినప్పటికి మేము చివరి వరకు పోరాడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను.  ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్లాసెన్‌, నితీశ్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. మ్యాచ్‌ను ఇంత క్లోజ్‌గాతీసుకెళ్లిన క్రెడిట్ వారికే దక్కుతుంది. అయితే మేము మా బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రిషబ్ పంత్ కూడా తెలివిగా ఆడాడు. సింగిల్స్ తీసుకుంటూ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి, మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో మేము తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కిషన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: బోణీ కొట్టిన లక్నో.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో ఓటమి

Advertisement
 
Advertisement
Advertisement