సీఎస్‌కేపై ఆర్సీబీ ఘన విజయం | Tim David Heroics Help Bengaluru Thrash Chennai By 43 Runs, Check Out Match Highlights Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేపై ఆర్సీబీ ఘన విజయం

Apr 5 2026 11:22 PM | Updated on Apr 6 2026 4:25 PM

Tim David heroics help Bengaluru thrash Chennai by 43 runs

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండో విజ‌యం నమోదు చేసింది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 250 ప‌రుగులు చేసింది.

బెంగళూరు బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్‌(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్‌(19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో 48) విధ్వంసం. సీఎస్‌కే బౌలర్లలో ఓవర్టన్‌, కాంబోజ్‌, శివమ్‌ దూబే తలా వికెట్‌ సాధించారు.

సంజూ మ‌ళ్లీ ఫెయిల్‌..
251 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెన‌ర్లు సంజూ శాంసన్‌(9), రుతురాజ్‌ గైక్వాడ్‌(7) మరోసారి విఫలమయ్యారు. అయితే సర్ఫరాజ్‌ ఖాన్‌(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), ప్రశాంత్‌ వీర్‌(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్‌ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు.

ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.  కాగా సీఎస్‌కేకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Advertisement
 
Advertisement
Advertisement