చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌ | Bhuvneshwar Kumar Creates Historic Record | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌

Apr 5 2026 10:31 PM | Updated on Apr 5 2026 10:31 PM

Bhuvneshwar Kumar Creates Historic Record

టీమిండియా వెట‌ర‌న్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా భువీ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అయూశ్ మాత్రేను ఔట్ చేసిన భువీ.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్కును కేవలం లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాత్రమే అందుకున్నాడు. చాహల్ 176 మ్యాచ్‌లలో 224 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2024 సీజన్‌లో తన 153వ మ్యాచ్‌లోనే చాహల్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు భువనేశ్వర్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలు పెట్టిన భువనేశ్వర్‌.. ఆ తర్వాత పుణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున నాలుగు సీజన్ల పాటు ఆడిన భువీ.. గతేడాది తిరిగి తన సొంత గూటి(ఆర్సీబీ)కి చేరాడు. ఐపీఎల్‌-2025లో భువీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసి ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
యజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు 
భువనేశ్వర్ కుమార్: 200 వికెట్లు 
సునీల్ నరైన్ : 192 వికెట్లు
పీయూష్ చావ్లా : 192 వికెట్లు 
రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లు
చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement