Rcb vs csk live updates and highlights: ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడతున్నాయి.
ఆర్సీబీ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 251పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
సీఎస్‌కే ఏడో వికెట్ డౌన్
సీఎస్‌కే ఏడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ఓవర్టన్.. సుయాష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్:178/7
సీఎస్‌కే ఆరో వికెట్ డౌన్
సీఎస్‌కే ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శివమ్ దూబే.. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్
సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్
సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన సర్ఫరాజ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ
సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
5 ఓవర్లకు సీఎస్‌కే స్కోరెంతంటే?
5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్(18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) దూకుడుగా ఆడుతున్నాడు.
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్
సీఎస్‌కే స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు చేసి శాంసన్ ఔటయ్యాడు.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్
అయూశ్ మాత్రే రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మాత్రే.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సీఎస్‌కే తొలి వికెట్ డౌన్
251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే అదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో రుతురాజ్ పెవిలియన్‌కు చేరాడు.
ఆర్సీబీ భారీ స్కోర్
చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో టిమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్(19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 48) మెరుపులు మెరిపించారు. సీఎస్‌కే బౌలర్లలో ఓవర్టన్, కాంబోజ్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.
టిమ్ డేవిడ్ విధ్వంసం
ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. జేమీ ఓవర్టన్ వేసిన 19 ఓవర్‌లో డేవిడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 237/3
భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ
17 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రజిత్ పాటిదార్(40), టిమ్ డేవిడ్(26) దూకుడుగా ఆడుతున్నారు.
ఆర్సీబీ మూడో వికెట్ డౌన్
ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన దేవ్‌దత్త్ పడిక్కల్.. ఓవర్టన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. ఫిల్స్‌సాల్ట్ ఔట్
శివం దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌కి దొరికిపోయిన ఫిల్స్‌సాల్ట్
7 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 66/1
7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 66 పరుగలుఉ చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(33), దేవ్‌దత్త్ పడిక్కల్(3) ఉన్నారు.
విరాట్ కోహ్లి ఔట్
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన కోహ్లి.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 44-1
3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?
3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫిల్ సాల్ట్(8) ఉన్నారు.
ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.
ఈ మ్యాచ్‌కు కూడా సీఎస్‌కే లెజెండ్ ఎంఎస్ ధోని, యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యాడు. ధోని త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ స్పష్టం చేశాడు. మరోవైపు ఆర్సీబీ స్టార్ జోష్ హాజిల్‌వుడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికి, ఈమ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ


