వైశాలికి రెండో గెలుపు | Vaishali wins second win in the womens category of the Candidates Chess Tournament | Sakshi
Sakshi News home page

వైశాలికి రెండో గెలుపు

Apr 6 2026 3:41 AM | Updated on Apr 6 2026 3:41 AM

Vaishali wins second win in the womens category of the Candidates Chess Tournament

పెయియా (సైప్రస్‌): క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. టాన్‌ జోంగి (చైనా)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో వైశాలి 51 ఎత్తుల్లో గెలుపొందింది. ఏడో రౌండ్‌ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. 

ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనా ముజిచుక్‌ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement