భారత మహిళల జోరు | Divya Deshmukh shines in womens category at World Candidates Chess Tournament | Sakshi
Sakshi News home page

భారత మహిళల జోరు

Apr 5 2026 4:00 AM | Updated on Apr 5 2026 4:00 AM

Divya Deshmukh shines in womens category at World Candidates Chess Tournament

పాఫోస్‌ (సైప్రస్‌): వరల్డ్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి రమేశ్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్‌ సత్తా చాటారు. వీరిద్దరు శనివారం జరిగిన తమ ఆరో రౌండ్‌ గేమ్‌లలో విజయాలు అందుకున్నారు.  వైశాలి 47 ఎత్తుల్లో కేటరినా లాగ్నో (రష్యా)ను ఓడించగా...దివ్య 46 ఎత్తుల్లో బిబిసర అసుబయెవా (కజకిస్తాన్‌)పై గెలుపొందింది. 

వీరిద్దరికి టోర్నీలో ఇదే తొలి విజయం కావడం విశేషం. మరో వైపు పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. శనివారం జరిగిన ప్రజ్ఞానంద, నకమురా మధ్య జరిగిన ఆరో రౌండ్‌ పోరు 23 ఎత్తులో సమంగా ముగిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement