గుజరాత్‌పై రాయల్స్ గెలుపు
ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్‌పై రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్
106 పరుగుల వరకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు దిశగా సాగిన గుజరాత్.. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. రవి బిష్ఱోయ్ (3-0-31-4) ఒక్కసారిగా చెలరేగి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 161-7గా ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
10.4వ ఓవర్- 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (73) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 8వ ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి కుమార్ కుషాగ్రా (18) ఔటయ్యాడు.
ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్
భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు.
రాయల్స్ భారీ స్కోర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్
15.3వ ఓవర్- 165 పరుగుల వద్ద రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశోక్ శర్మ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (18) ఔటయ్యాడు.
జైస్వాల్ (55) ఔట్
12.3వ ఓవర్-126 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జురెల్‌కు (31) జతగా రియాన్ పరాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు.
వైభవ్ సూర్యవంశీ (31) ఔట్
6.2వ ఓవర్- 70 పరుగుల వద్ద రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు.
ధాటిగా ఆడుతున్న జైస్వాల్, సూర్యవంశీ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ ధాటిగా ఆడుతుంది. పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆ జట్టు 69 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (35), వైభవ్ సూర్యవంశీ (31) చెలరేగి ఆడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌కు వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించనుండటమే రియాన్ నిర్ణయానికి కారణం. ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్ ఆడటం లేదు. గిల్ స్థానంలో రషీద్ ఖాన్ టాస్‌కు వచ్చాడు.
ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ శర్మ స్థానంలో తుషార్ దేశ్‌పాండే.. రవి బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబే జట్టులోకి వచ్చారు. గుజరాత్ విషయానికొస్తే.. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగుతుంది.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(c), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, అనుజ్ రావత్, జయంత్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
ఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, రవి సింగ్


