వైశాలి, దివ్య ‘హ్యాట్రిక్‌’ డ్రా | Divya Deshmukh played out a draw with R Vaishali | Sakshi
Sakshi News home page

వైశాలి, దివ్య ‘హ్యాట్రిక్‌’ డ్రా

Apr 1 2026 4:34 AM | Updated on Apr 1 2026 4:34 AM

Divya Deshmukh played out a draw with R Vaishali

పెయియా (సైప్రస్‌): క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి, దివ్య దేశ్‌ముఖ్‌ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేశారు. అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో మంగళవారం జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను వైశాలి 41 ఎత్తుల్లో... అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. ఓపెన్‌ విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద తొలి ఓటమి చవిచూశాడు.

జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్‌ విభాగంలో, మహిళల విభాగంలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో 14 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నిర్ణిత 14 రౌండ్ల తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతలుగా నిలుస్తారు. మహిళల విభాగం చాంపియన్‌ ప్రస్తుత విశ్వవిజేత జు వెన్‌జున్‌తో... ఓపెన్‌ విభాగం విన్నర్‌ ప్రస్తుత జగజ్జేత గుకేశ్‌తో ప్రపంచ చాంపియన్‌షీప్‌ టైటిల్‌ కోసం తలపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement