ఉన్మాదుల కామ దాహానికి మరో అతివ బలైంది. హర్యానాలో ఓ మహిళపై 10 మంది కామ పిశాచులు ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రేవారి(హర్యానా): ఉన్మాదుల కామ దాహానికి మరో అతివ బలైంది. హర్యానాలో ఓ మహిళపై 10 మంది కామ పిశాచులు ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రేవారికి సమీపంలోని బలైర్ ఖుర్ద్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. భర్తను బందించి అతని భార్యపై సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకం అనంతరం రూ.7 వేల నగదు, గహోపకరణాలను దోచుకుని నిందితులు పరారయ్యారు.
బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు తుపాకీతో బెదిరించి ఆమె భర్తను మంచానికి కట్టేసి ధాష్టీకానికి దిగారు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని కూడా నిందితులు తరలించుకునిపోయినట్లు పోలీసులు తెలిపారు.