కేరళలో మహిళ కీచక చర్య! | Woman arrested for sexually abusing 13 year old girl | Sakshi
Sakshi News home page

కేరళలో మహిళ కీచక చర్య!

Mar 18 2017 12:15 PM | Updated on Jul 23 2018 8:49 PM

కేరళలో మహిళ కీచక చర్య! - Sakshi

కేరళలో మహిళ కీచక చర్య!

దేశంలో మైనర్‌ బాలలపై లైంగిక అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

దేశంలో మైనర్‌ బాలలపై లైంగిక అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో 13 ఏళ్ల బాలికపై ఓ మహిళ కీచకంగా ప్రవర్తించింది. బాలికను లైంగికంగా వేధించి తన వికృతబుద్ధిని చాటుకుంది. కొచ్చిలోని పల్లురుథీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  కీచకంగా ప్రవర్తించిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు పోలీసు కస్టడీ విధించింది.

మైనర్‌ బాలిక దుస్తులు మార్చుకుంటుండగా.. ఆమె అశ్లీలంగా ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి బహిరంగ పరుస్తానని బెదిరించి.. అప్పటినుంచి బాలికతో లైంగికంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట ఈ విషయాన్ని చెప్పడానికి భయపడ్డ బాలిక.. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలుపడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుస నిందితురాలని అరెస్టు చేశారు. బాలిక అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసిన ఫోన్‌తోపాటు సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement