బెయిల్పై మావోయిస్టు అనూరాధా శర్మ విడుదల | Wife of top Maoist get released from jail on bail | Sakshi
Sakshi News home page

బెయిల్పై మావోయిస్టు అనూరాధా శర్మ విడుదల

Aug 17 2013 9:08 PM | Updated on Aug 13 2018 7:43 PM

మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రవిశర్మ భార్య అనూరాధా శర్మ అలియాస్ రంజిత బెయిల్పై శనివారం విడుదలయ్యారు.

మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రవిశర్మ భార్య అనూరాధా శర్మ అలియాస్ రంజిత బెయిల్పై శనివారం విడుదలయ్యారు. జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లు జైలు వర్గాలు తెలిపాయి. నాలుగు రాష్ట్రాల్లోని పలు కేసుల్లో ఈ దంపతులిద్దరూ మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. వీరిద్దరినీ 2009 అక్టోబర్ నెలలో జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జాతీయ పార్కు వద్ద అరెస్టు చేశారు. అప్పటినుంచి వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీ కింద హజారీబాగ్లోని జయప్రకాష్ నారాయణ్ సెంట్రల్ జైల్లో అదుపులో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు శర్మ దంపతుల కోసం ఎప్పటినుంచో గాలిస్తున్నారు. ఇంతలో వీరు 2009 సంవత్సరంలో అరెస్టయ్యారు. జైలులో ఆడ ఖైదీల పిల్లలకు అనూరాధ పాఠాలు బోధించేవారని జైలు వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement