వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌ | AP High Court Grants Bail to Alur MLA Virupakshi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

Oct 8 2026 4:32 PM | Updated on Oct 8 2026 4:39 PM

AP High Court Grants Bail to Alur MLA Virupakshi

సాక్షి,అమరావతి: ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

గత 68 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి విడుదల కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదోనిలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి.

ఎమ్మెల్యే తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్, లక్ష్మీకాంత్‌ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం తీర్పును గురువారానికి రిజర్వ్‌ చేసింది.

ఇరువర్గాల వాదనలు, న్యాయస్థానం పరిశీలన అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఊరట పొందగా, ఇప్పుడు అట్రాసిటీ కేసులోనూ బెయిల్ రావడంపట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 68 రోజుల రిమాండ్ అనంతరం ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.

ఇదీ చదవండి : ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement